'టీఆర్ఎస్ది రాజకీయ వ్యభిచారం' | cpi leader chada venkat reddy slams trs | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ది రాజకీయ వ్యభిచారం'

Published Mon, Jun 20 2016 2:27 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

cpi leader chada venkat reddy slams trs

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి ఫిర్యాదు చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయిస్తే వెంటనే సభ్యత్వం రద్దు చేయాలన్న కేంద్రమంత్రి వెంకయ్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. పార్లమెంటులో ఈ మేరకు వెంటనే రాజ్యాంగ సవరణ తేవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ది హోల్‌సేల్ రాజకీయ వ్యభిచారమని దుయ్యబట్టారు. పార్టీలు మారిన వాళ్లు, చేరిన వాళ్ల లెక్కలు తేలుస్తామని చాడ హెచ్చరించారు. మల్లన్నసాగర్ విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షాలతో యుద్ధానికి దిగుతోందని ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement