వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జోతిని కలిశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని వారు ఈ సందర్భంగా సీఈసీ ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటు వేయకుంటే రోడ్డుపై ఎలా తిరుగుతారు, పార్టీకి ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు ఆపివేస్తామని బెదిరిస్తున్నారని, అలాగే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.50 లక్షలు ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు ఈ సందర్భంగా ఏకే జోతికి వినతిపత్రం సమర్పించారు.