అప్పుడే మొదలైన ఇంటర్ ప్రవేశాలు
రంగంలోకి దిగిన పీఆర్వోలు
ఫోన్‌లలో ‘బుక్’ చేసుకుంటున్న వైనం
‘పది’ పరీక్షలు కాకముందే హడావుడి
అడ్డగోలు దోపిడీకి రంగంనిబంధనలకు పాతర
పట్టించుకోని అధికారులు
‘‘హలో.. నమస్తే సార్.. మల్లేశం గారా.. మీ అబ్బారుు పదో తరగతే కదా.. ఇంటర్ ఏ కాలేజీలో చదివిద్దామనుకుంటున్నారు. మాకు తెలిసిన మంచి కాలేజీ ఉంది.. అందులో చేర్పించండి. ఫీజులో 30 నుంచి 50 శాతం వరకు రారుుతీ ఇప్పిస్తా. అదనపు చార్జీలేమీ ఉండవు’’ కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు విద్యార్థుల తల్లిదండ్రులను వలలో వేసుకుంటున్న తీరిది.
కరీంనగర్ ఎడ్యుకేషన్ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ఐదు నెలల ముందే కార్పొరేట్ కళాశాలలు ఇంటర్‌లో ప్రవేశాలకు తెరలేపాయి. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ముందుగానే ‘బుక్’ చేసుకుంటున్నారుు. కార్పొరేట్ కళాశాలలు జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ పీఆర్వోలను నియమించుకుని ప్రవేశాలు పెంచుకుంటున్నారుు. వీరి ద్వారా పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారుు. ఫిబ్రవరి 25లోపు ప్రవేశాలకు మాత్రమే ఫీజులో రాయితీ ఉంటుందని నమ్మబలుకుతూ కనీసం 60 శాతం ఫీజును ముందే తీసేసుకుంటున్నారుు.
భారీగా ఫీజుల దోపిడీ
ఎంపీసీ ట్రిపుల్‌ఈ పేరుతో ఏడాదికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నారుు. ఇదే గ్రూప్ విద్యార్థులు ఎయిర్‌కండీషన్డ్ క్యాంపస్‌లో చదువుకోదలిస్తే రూ.1.25 లక్షల వరకు ఖర్చవుతుంది. సీఈసీ, ఎంఈసీ,హెచ్‌ఈసీ గ్రూప్‌ల్లో సివిల్స్ ఫౌండేషన్ పేరుతో కొత్త కోర్సును పరిచయం చేస్తూ రూ.1.65 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారుు. సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌తో సీఏ, సీపీటీ పేర్లు జోడించి రూ.2.25 లక్షలు డిమాండ్ చేస్తున్నారుు.
నిబంధనలకు పాతర
పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్ లో ఇంటర్ ప్రవేశాలు తీసుకోవాలి. ఇందుకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్వోల ద్వారా నియామకాలు చేసుకోకూడదు. పదో తరగతి పరీక్షల ప్రారంభానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. అయినా నిబంధనలను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలు అడ్డగోలు ప్రచారానికి తెరలేపుతున్నాయి.
తిరిగొస్తే డబ్బులు గోవిందా
కార్పొరేట్ కళాశాలల్లో నిర్ణీత మొత్తాన్ని చెల్లించి ముందస్తు ప్రవేశాలు తీసుకున్న విద్యార్థుల్లో కనీసం 30 శాతం మంది విద్యార్థులు అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. పరిసరాలకు అలవాటు పడక అనారోగ్యం పాలవడంతో చాలా మంది ఇంటికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో కళాశాల మానేసినఫీజు తిరిగి ఇవ్వడం లేదు.
పాఠశాలల నిర్వాహకులకు తాయిలాలు
విద్యార్థులు చదువుతున్న పాఠశాల నిర్వాహకులకు భారీ తాయిలాలు ముట్టజెప్పేలా ముంద స్తు ఒప్పందాలు చేసుకుంటున్నారుు. వందకు పైగా పదో తరగతి విద్యార్థులు చదువుకుంటు న్న పాఠశాలల నిర్వాహకులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ముడుపులు, లేదా ఆ స్థా యి బహుమతులు అందజేస్తూ.. ఆయూ పాఠశాలల్లోని పిల్లలను తమ కళాశాలలో చేర్పించేలా చూస్తున్నారుు.
పీఆర్వోలే కీలకం
జిల్లా కేంద్రం, అన్ని డివిజన్ కేంద్రాలతోపాటు జమ్మికుంట, కోరుట్ల, మెట్‌పల్లి, గోదావరిఖ ని, వేములవాడ తదితర ప్రాంతాల్లో పీఆర్వోలను నియమించుకున్నట్లు సమాచారం. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులను తమ పీఆర్వోలుగా నియమించుకుంటున్నారు. వీరి కి నెలకు రూ.8 వేల వరకు ఏడాది పొడవునా జీతం రూపంలో చెల్లిస్తున్నారు. పార్ట్‌టైమ్ పీఆర్వోలకు ఒక్కో విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు చెల్లిస్తే 10 శాతం వరకు గిట్టుబాటు అవుతోంది. ఈ తాయిలాలకు ఆకర్షితులైన చాలా మంది పీఆర్వోలుగా చేరి వివిధ ప్రాంతాల్లో రోజుకు మంద మందిని కార్పొరేట్ కళాశాలలకు పంపుతున్నారు.
విద్యార్థులపై కార్పొరేట్ వల
Published Mon, Feb 29 2016 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM
Advertisement
Advertisement