‘అన్ని ఎన్నికలూ ఒకేసారి నిర్వహించగలం’
మెల్‌బోర్న్: అన్ని పార్టీలూ ఏకాభిప్రాయానికి వచ్చి, రాజ్యాంగ సవరణలు చేస్తే దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ చెప్పారు. ఇందుకు అధిక సంఖ్యలో ఈవీఎంలు, తాత్కాలిక సిబ్బంది వంటి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన అంతర్జాతీయ ఎన్నికల సందర్శకులు (ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్) కార్యక్రమంలో జైదీ పాల్గొన్నారు. అనంతరం జైదీ మాట్లాడుతూ... పార్లమెంటరీ కమిటీకి ఏకకాల ఎన్నికల ప్రతిపాదన చేశాం. కార్యరూపం దాల్చాలంటే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మధ్య విస్తృత చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.