చంద్రబాబు నాయుడు దోషిగా బోనులో నిలబడాల్సిన సమయం వచ్చింది.. అందుకే ఓట్ల తొలగింపు వంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టా రెడ్డి ధ్వజమెత్తారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అక్రమాల వల్ల త్వరలోనే ఆయన బోనులో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు.