ఓ కేసులో స్వయంగా ప్రధాన ఎన్నికల కమిషనరే(సీఈసీ) కోర్టుకు హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
చెన్నై: ఓ కేసులో స్వయంగా ప్రధాన ఎన్నికల కమిషనరే(సీఈసీ) కోర్టుకు హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి సక్కరపాణి.. ఒద్దంచత్రం స్థానం నుంచి గెలవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారిస్తున్న జస్టిస్ ఎంవీ మురళీధరన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది ఈ కేసు విచారణకు రావాలని పలుసార్లు నోటీసులిచ్చినా డుమ్మా కొడుతుండడంతో.. సీఈసీతోపాటు జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు హుకుం జారీ చేసింది. సక్కరపాణి ఓటర్లకు లంచమిచ్చి గెలిచారని కరుప్పసామి అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు.