
ఓటర్ల తొలగింపు పై సీఈసీ కీలక నిర్ణయం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమంగా ఓటర్లను తొలగించారన్న రాజకీయ పార్టీల ఫిర్యాదుతో సీఈసీ(కేంద్ర ఎన్నికల కమిషన్) స్పందించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తొలగింపుపై బుధవారం సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాను పునః పరిశీలించాలని, మొత్తం ప్రక్రియను ఈనెల 18 లోపు పూర్తి చేయాలని సూచించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో బీసీ ఓటర్ల నమోదులో భాగంగా...ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు వచ్చిన చోట విచారణ జరపాలని సీఈసీ ఆదేశించింది.