'గవర్నర్ కూడా పక్షపాతం చూపుతున్నారు'
హైదరాబాద్: తలసాని శ్రీనివాస యాదవ్ రాజ్యాంగవిరుద్ధంగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. తలసాని రాజీనామా విషయంలో గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు.
బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ను శశిధర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్దేశపూర్వకంగానే జీహెచ్ ఎంసీ పరిధిలో సెటిలర్స్ సహా కొంతమంది ఓట్లు తొలగించారని ఆరోపించారు. తొలగించిన ఓటర్ల లిస్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.