'వరుస ఎన్నికలతో అందరికీ ఇబ్బందే'
వరుస ఎన్నికలతో అంతా ఇబ్బందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మున్సిపల్, జిల్లా పరిషత్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వరుసగా నిర్వహించడం వల్ల ఓటర్లు, అభ్యర్థులు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడేంతవరకైనా మున్సిపల్, జిల్లా పరిషత్ ఫలితాలను నిలిపేయాలని ఆయన కేంద్రం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫలితాలను వాయిదా వేసేందుకు మార్గం చూడాలన్నారు.
అయితే ఉన్నఫళంగా స్థానిక ఎన్నికలు రావడం పార్టీలకు ఇబ్బందే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తెలిపారు. టిక్కెట్ ఆశించే అభ్యర్థులు ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్కు మరింత ఇబ్బంది తప్పదని ఆయన పేర్కొన్నారు.