జూన్‌ 4 తర్వాత అన్నీ మాట్లాడదాం: లోకేష్‌పై పెద్దిరెడ్డి ఫైర్‌ | Minister Peddireddy Counter To Nara Lokesh Devineni Uma | Sakshi
Sakshi News home page

జూన్‌ 4 తర్వాత అన్నీ మాట్లాడదాం: లోకేష్‌పై పెద్దిరెడ్డి ఫైర్‌

Published Sun, May 19 2024 6:00 PM | Last Updated on Sun, May 19 2024 6:11 PM

Minister Peddireddy Counter To Nara Lokesh Devineni Uma

తిరుపతి,సాక్షి: టీడీపీ కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని, లోకేశ్ తమపై ట్విటర్‌లో తప్పుడు పోస్టులు పెడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పప్పు లోకేష్ అంటారన్నారు. తిరుపతిలో ఆదివారం(మే19) పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు. 2013 నుంచి ఆఫ్రికాలో మేం వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకు పంపిస్తున్నాం. మొదటి విడత 20 వాహనాలు ముంబై పోర్ట్ నుంచి షిప్పులో పంపిస్తున్నాం. అక్కడ మాకు ఫెర్రో మాంగనీస్‌, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులున్నాయి.

 స్వర్ణ మెటల్స్ కు 100 వెహికల్స్ అవసరం ఉంది , ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాం. మేం వ్యాపారాలు చేసుకుంటూ రాజీయాల్లో ఉన్నాం. మేం విదేశాలకు పారిపోతున్నాం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

 పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఐదేళ్లు మంత్రిగా చేసి, సీటు తెచ్చుకోలేని నువ్వు మాట్లాడతావా. ఏపీ బీజేపీ నాయకురాలికి హైదారాబాద్‌లో ఓటు ఉంది. చంద్రబాబు కూడా హైదారాబాద్‌లో ఓటు పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. నేను విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ యునియన్ నాయకుడిగా చంద్రబాబుకు పోటీగా నిలబడ్డా. 

4వ తేది ఎన్నికలు ఫలితాల తర్వాత మీరు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. మేం చేసిన సంక్షేమ పథకాల వల్లే పోలింగ్ పెరిగింది. 4వ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదాం. పోలింగ్ శాతం పెరగడానికి మహిళలే కారణం.  ఐ ప్యాక్‌ టీమ్ ఇదే చెప్పింది. అందరి కృషివల్లే మేము ఎక్కువ సీట్లతో ఘన విజయం సాధిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఘర్షణలు జరిగాయి’అని పెద్దిరెడ్డి ఆరోపించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement