Peddireddi Ramachandra Reddy
-
జూన్ 4 తర్వాత అన్నీ మాట్లాడదాం: లోకేష్‌పై పెద్దిరెడ్డి ఫైర్
తిరుపతి,సాక్షి: టీడీపీ కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని, లోకేశ్ తమపై ట్విటర్లో తప్పుడు పోస్టులు పెడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పప్పు లోకేష్ అంటారన్నారు. తిరుపతిలో ఆదివారం(మే19) పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.‘దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు. 2013 నుంచి ఆఫ్రికాలో మేం వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకు పంపిస్తున్నాం. మొదటి విడత 20 వాహనాలు ముంబై పోర్ట్ నుంచి షిప్పులో పంపిస్తున్నాం. అక్కడ మాకు ఫెర్రో మాంగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులున్నాయి. స్వర్ణ మెటల్స్ కు 100 వెహికల్స్ అవసరం ఉంది , ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాం. మేం వ్యాపారాలు చేసుకుంటూ రాజీయాల్లో ఉన్నాం. మేం విదేశాలకు పారిపోతున్నాం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఐదేళ్లు మంత్రిగా చేసి, సీటు తెచ్చుకోలేని నువ్వు మాట్లాడతావా. ఏపీ బీజేపీ నాయకురాలికి హైదారాబాద్‌లో ఓటు ఉంది. చంద్రబాబు కూడా హైదారాబాద్‌లో ఓటు పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. నేను విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ యునియన్ నాయకుడిగా చంద్రబాబుకు పోటీగా నిలబడ్డా. 4వ తేది ఎన్నికలు ఫలితాల తర్వాత మీరు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. మేం చేసిన సంక్షేమ పథకాల వల్లే పోలింగ్ పెరిగింది. 4వ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదాం. పోలింగ్ శాతం పెరగడానికి మహిళలే కారణం. ఐ ప్యాక్ టీమ్ ఇదే చెప్పింది. అందరి కృషివల్లే మేము ఎక్కువ సీట్లతో ఘన విజయం సాధిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఘర్షణలు జరిగాయి’అని పెద్దిరెడ్డి ఆరోపించారు. -
కుప్పంలో టీడీపీ కుప్పకూలి పోవటం ఖాయం బాబు కు అసలు డ్యామేజ్..!
-
చంద్రబాబును ఏకిపారేసిన పెద్దిరెడ్డి
-
చంద్రబాబుపై పెద్దిరెడ్డి కామెంట్స్
-
చరిత్రలో ఎన్నడూ చూడని జనం.. సీఎం జగన్ బస్సు యాత్రకు వస్తున్నారు
-
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, మరో 100 ఛార్జింగ్ స్టేషన్లకు కసరత్తు
సాక్షి, విజయవాడ: ఇంధన భద్రతను పెంచడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వాతావరణంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత ఆశాజనక మార్గాలలో ఒకటైన ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) రాష్ట్రంలో 250 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి వీలు కల్పించిందని ఇంధన, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడ భవానీపురంలోని రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ ద్వారా పనిచేసే సైన్స్ ఎగ్జిబిడ్స్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారని ఏపీసమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆవరణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్కోస్ట్) సహకారంతో ఎన్ఆర్ఈడీసీఏపీ ఏర్పాటు చేసిన పునరుత్పాదక ఇంధన వనరుల కేంద్రాన్ని(ఆర్ఈఆర్సీ) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఈ-మొబిలిటీకి ఒక నమూనాగా, పునరుత్పాదక ఇంధనానికి నాలెడ్జ్ హబ్ గా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీ రూపకల్పన, ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయడం, రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి ఈ -మొబిలిటీ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ను మంత్రి అభినందించారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందన్నారు. భారతదేశం బయో ఇంధనాలు, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారపడకుండా తదుపరి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుందని గుర్తుచేశారు. ఈ -మొబిలిటీని స్వీకరించడానికి దోహదపడే ఛార్జింగ్ స్టేషన్ల యొక్క బలమైన ఇంధన నెట్ వర్క్ ను నిర్మించే లక్ష్యంతో 2030 నాటికి పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగా నగర పరిధిలో 3 కి.మీ x 3 కి.మీ గ్రిడ్ లోపల మరియు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ మరియు ఎనర్జీ కన్జర్వేటివ్ కాన్సెప్ట్ ల గురించి సందర్శించే విద్యార్థులకు సౌలభ్యంగా సుమారు 30 పునరుత్పాదక ఇంధన గాడ్జెట్ లను ప్రదర్శించడానికి ఆర్ఈఆర్ సీ ఏర్పాటుకు చొరవ చూపినందుకు ఈ సందర్భంగా ఎన్ఆర్ఈడీసీఏపీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. నెట్ జీరో ఎమిషన్స్ టూరిస్ట్ ప్లేస్ గా తిరుపతిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తిరుపతిలో ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇప్పటివరకు తిరుపతి పట్టణంలో సుమారుగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నా యన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయన్నారు. సంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రయోజనకరంగా ఉండటమేగాకుండా స్థానిక పర్యావరణాన్ని రక్షించి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాయని సూచించారు. ఆర్ ఈఆర్ సీ సెంటర్ గురించి మాట్లాడుతూ అన్ని వయసుల విద్యార్థులకు అభ్యసన అవకాశాలను పెంపొందించేందుకు ఆర్ఈఆర్సీ దోహదపడుతుందన్నారు. అంతకుముందు విద్యుత్ వాహనాలను వాడుదాం-స్వావలంబన సాధిద్దాం, దేశ ప్రగతికి తోడ్పడుదాం లాంటి ఫ్లకార్డుల ప్రదర్శనతో మంత్రి పెద్దిరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సైన్స్ వరల్డ్ లో ఏర్పాటు చేసిన సర్ సీవీ రామన్, జగదీష్ చంద్రబోస్, ఆర్కిమెడిస్, ఆల్ బర్ట్ ఐన్ స్టీన్, చార్లెస్ డార్విన్, మేరీ క్యూరీ, బెంజ్ మెన్ ఫ్రాంక్లిన్,ఐజాక్ న్యూటన్, విక్రమ్ సారాబాయి, హోమీ జహంగీర్ బాబా తదితర శాస్త్రవేత్తలు వారు చేసిన కృషిని వివరిస్తూ ఉన్న ఎగ్జిబిషన్ ను, రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన మినియేటర్ న్యూక్లియర్ గ్యాలరీని మంత్రి తిలకించారు. అనంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా, డిజిటల్ టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులను స్వాగతిస్తూ ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. రీజినల్ సైన్స్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్థన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి, సభ్య కార్యదర్శి డాక్టర్ వై. అపర్ణ, జనరల్ మేనేజర్లు కె.శ్రీనివాస్, జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్రీనివాస్ రావు, ఎన్ఆర్ ఈడీసీఏపీ అధికారులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
2024 ఎన్నికల్లో వార్ వన్‌సైడ్: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తిరుపతి: 2024 ఎన్నికల్లో కూడా వార్ వన్‌సైడ్ ఉంటుందని.. గాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తామే గెలుస్తామని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుస్తారని బాలినేని అన్నారు. 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 మంది బీసీలే ఉన్నారని బాలినేని పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట: మంత్రి పెద్దిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధిస్తామని.. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను సీఎం జగన్ 98.5 శాతం అమలు చేశారన్నారు. కరోనా సమయంలోనూ సీఎం సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి అన్నారు. చదవండి: Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ -
వకుళమాత ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం జగన్
-
ప్రజల్ని కాల్చిచంపిన వారిని మర్చిపోయారా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై మాట్లాడుతున్న వారు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమాలు చేసిన రైతులపై కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఉదంతాలను మరిచిపోయారా.. అని విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఉత్పన్నం కావని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలపై దృష్టిసారించి సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరాపై ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్, ఏపీఎస్ఈసీఎంల అధికారులతో సచివాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ల నుంచి త్వరలో మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆరువేల మెగావాట్ల హైడల్ (పంప్డ్ హైడ్రో స్టోరేజీ) విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విద్యుత్ కొరత తాత్కాలికమేనని, మే ఒకటి నుంచి విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు. రోజుకు 55 మిలియన్ యూనిట్ల కొరత రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని పెద్దిరెడ్డి చెప్పారు. రోజుకు 55 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం దీన్లో 30 మిలియన్ యూనిట్లను విద్యుత్ ఎక్సే్ఛంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. పంటలను కాపాడుకోవటం కోసం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేసున్నామన్నారు. గృహవిద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్‌లోను 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగించాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. బొగ్గుసరఫరాలో ఎదురవుతున్న సమస్యల కారణంగా థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ వినియోగానికి పరిమితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, నెడ్‌క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి ఘన స్వాగతం
-
అటవీ భూముల ఆక్రమణలను గుర్తించాలి
సాక్షి, అమరావతి: భూ వివాదాలకు తెర దించుతూ శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టిన సమగ్ర భూ సర్వేను వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అధికారులకు సూచించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించేందుకు అవసరమైతే రెవెన్యూ, అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేయాలని స్పష్టం చేశారు. తొలుత అటవీ భూముల సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించాలన్నారు. సబ్ కమిటీ గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమై పలు సూచనలు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్) శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిదార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ ఎం.ఎం.నాయక్, డీఎంజీ వెంకటరెడ్డి, డీటీసీపీ డైరెక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. కాపాడకుంటే పర్యావరణ సమస్యలు.. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తూ తొలిదశలో 51 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి కాగా ఈ ఏడాది చివరి నాటికి 11,501 గ్రామాల్లో పూర్తి చేసే లక్ష్యంతో కృషి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించిది. అటవీశాఖ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం, నకిలీ ధ్రువపత్రాలతో ఆక్రమించుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భాల్లో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేస్తున్నారని చెప్పారు. అటవీ భూములను కాపాడుకోకుంటే పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వీటిని నివారించేందుకు శాస్త్రీయంగా ఆక్రమణలను గుర్తించాలన్నారు. సర్వే పనులు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు సబ్ కమిటీ పేర్కొంది. ఇప్పటికే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమైనట్లు తెలిపింది. 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే జరుగుతోందన్నారు. 2023 జూన్ నాటికి దశలవారీగా రీసర్వే పూర్తి కావాలన్న లక్ష్యం మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 1,287 గ్రౌండ్ ట్రూతింగ్ లో భాగంగా 1,287 ఆవాస ప్రాంతాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 606 గ్రామాల్లో తొలివిడత మ్యాపింగ్, 515 హ్యాబిటేషన్లలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 161 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ వాలిడేషన్ ముగిసింది. అన్ని శాఖల సమన్వయంతో రీసర్వేను లక్ష్యం మేరకు పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. -
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సీఎం జగన్ హామీలన్నీ అమలు చేశారు
-
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి
-
7 నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ రెండో విడత నగదు జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడతగా రాష్ట్రంలోని 78.75 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.6,470 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 7న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్లు, జేసీలు, డ్వామా, డీఆర్డీఏ పీడీలతో మంత్రి పెద్దిరెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి (2019 ఏప్రిల్ 11) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తం తమ ప్రభుత్వమే భరిస్తుందన్న మాటను సీఎం నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. నాలుగు విడతల్లో పొదుపు సంఘాల మహిళలకు వారి అప్పు మొత్తం చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామని, మొదటి విడత గతేడాది చెల్లించామని గుర్తు చేశారు. అక్టోబర్ 8న జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు ఆసరా రెండో విడత చెల్లింపులను ఉత్సాహంగా నిర్వహించాలన్నారు. ఈ పది రోజుల్లో వ్యాపార అవకాశాలు, ఉపాధి మార్గాలపై మహిళలకు అవగాహన, బ్యాంకు రుణాలు పొందేలా చూడటం, మార్కెటింగ్ అవకాశాలు వివరించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం ఆరోగ్యవంతమైన గ్రామసీమలే లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం నినాదంతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం అక్టోబర్ 2న సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుందని పెద్దిరెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో వంద రోజుల పాటు ఒక ఉద్యమంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి
-
వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు: పెద్దిరెడ్డి
-
శ్రీకాళహస్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ
-
స్ట్రైయిట్ టాక్ - పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-
‘హైదరాబాద్‌లో దాక్కుని తప్పుడు ఆరోపణలా..’
-
కరోనా: వాస్తవ పరిస్టితిపై మంత్రి పెద్దిరెడ్డి ఆరా
-
స్థానిక ఎన్నికలు జరిగితే...
-
వెలుగు సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి
-
ఇచ్చిన ప్రతిహామీని సీఎం జగన్ అమలు చేస్తారు
-
చంద్రబాబు, లోకేష్ జైలుకు పోవడం ఖాయం : పెద్దిరెడ్డి
-
చంద్రబాబు స్వార్థం కోసమే హోదాను తాకట్టుపెట్టారు