![Ysrcp Leaders Exude Confidence Of Winning Mlc Elections - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/26/TPT.jpg.webp?itok=VZ1KqWJs)
సాక్షి, తిరుపతి: 2024 ఎన్నికల్లో కూడా వార్ వన్‌సైడ్ ఉంటుందని.. గాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తామే గెలుస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుస్తారని బాలినేని అన్నారు. 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 మంది బీసీలే ఉన్నారని బాలినేని పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట: మంత్రి పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధిస్తామని.. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను సీఎం జగన్ 98.5 శాతం అమలు చేశారన్నారు. కరోనా సమయంలోనూ సీఎం సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి అన్నారు.
చదవండి: Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ
Comments
Please login to add a commentAdd a comment