సభ్యులపై చర్యలు తీసుకోవద్దు
ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెందాలని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పార్టీ శాసనసభాపక్షం ఉపనేత, సభా హక్కుల సంఘం సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఆయన శనివారం సభా హక్కుల సంఘం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను సుదీర్ఘ కాలంపాటు శాసనసభలో సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. ‘ప్రత్యేక హోదా కోసం గళమెత్తే సమయంలో సభ్యులు కొంత ఆగ్రహానికి గురై ఉండవచ్చు.
గతంలో ఎన్నో దారుణమైన సంఘటనలు జరిగాయి. కానీ రాష్ట్రానికి ఎంతో కీలకమైన హోదా విషయంలో చిన్న అంశాన్ని కారణంగా చూపి చర్యలు తీసుకుంటా మనడం సమంజసం కాదని వివరించానని’ పెద్దిరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలపై ఏవైనా చర్యలు తీసుకోవాలని భావించే పక్షంలో ఆ నిర్ణ యంలో తాను భాగస్వామిని కానని, వాటితో తాను ఏకీభవిం చనంటూ తన అసమ్మతిని ప్రివిలేజెస్ కమిటీకి ఇచ్చానని తెలిపారు.
శాసనసభలో వ్యతిరేకిస్తాం..
‘‘గతంలో సభలో గవర్నర్‌పై దాడి జరిగింది. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ అలపాటి ధర్మా రావును అనరాని మాటలంటే ఆయన కుర్చీలోనే కూర్చుండిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరువాత మరోసారి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దళిత మహిళ, డిప్యూటీ స్పీకర్ కుతూహల మ్మపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పు డు జరిగిన సంఘటనలు అంతకన్నా ఘోరమైనవి కావు. మళ్లీ మళ్లీ చెబు తున్నా... ఎమ్మెల్యేలపై చర్యలు వద్దు’’ అని పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చర్యలకు సిఫార్సు చేస్తే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవద్దని స్పీకర్‌కు, శాసనసభా వ్యవహారాల మంత్రికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అది నిరంకుశత్వమే అవుతుంది కనుక శాసనసభలో వ్యతిరేకిస్తామన్నారు.