
సాక్షి, ఢిల్లీ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేష్ అన్న నీతి ఆయోగ్.. ఈ చట్టం తో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రం అని.. భూములపై రైతులకు సర్వహక్కులు లభిస్తాయని పేర్కొంది.
పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని.. ఈ చట్టంతో భూ పరిపాలన మరింత సులువవుతుందన్న నీతి ఆయోగ్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. సాక్షి డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్ వెంకటేష్ అడిగిన ఆర్టీఐ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం పంపింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” కు వ్యతిరేకంగా జరిగిన విస్తృత ప్రచారానికి నీతి అయోగ్ వివరణతో రైతుల్లో భరోసా, నమ్మకం పెరగనుంది. ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై రైతుల అనుమానాలు తొలగనున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై రైతులను తప్పుదోవ పట్టించిన ప్రచారానికి చెల్లు చీటీ పడింది.
అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నీతి ఆయోగ్ సమాధానం పంపింది. నీతి ఆయోగ చైర్మనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాగా, టీడీపీ-జనసేన కూటమి దుష్ప్రచారానికి ఇక చెక్ పడినట్లే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో రైతులకు టైటిల్ పై పరిపూర్ణ హక్కుల లభిస్తాయని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేశారు. సీఎం జగన్ మాటనే బలపరుస్తూ నీతి ఆయోగ్ సమాధానం ఇచ్చింది. ఈ అంశంతో మరోసారి విశ్వసనీయతకు సీఎం జగన్ మారుపేరుగా నిలిచారు.
కాగా, ఓటమి భయంతో చంద్రబాబు గ్యాంగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీచమైన ప్రచారానికి ఒడిగట్టింది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మార్చింది.

భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.
ప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది.

Comments
Please login to add a commentAdd a comment