ఎదురుగాలి ఎందుకంటే? | Reasons For Ysrcp Defeat In Ap Elections | Sakshi
Sakshi News home page

ఎదురుగాలి ఎందుకంటే?

Published Tue, Jun 4 2024 5:05 PM | Last Updated on Tue, Jun 4 2024 5:14 PM

Reasons For Ysrcp Defeat In Ap Elections

గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘనవిజయం సాధించిన వైఎస్సార్‌సిపికి ఈ సారి అనూహ్యమైన ఫలితాలను చవి చూసింది. సంక్షేమం, అభివృద్ధి అన్న రెండు అంశాలతో ఎన్నికలకు వెళ్లిన వైఎస్సార్‌సిపి తాను అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ ఫ్యాన్‌కు ఎదురుగాలి వీచింది.

వైఎస్సార్‌సీపీ ఓటమికి కారణాలు:

  • వైఎస్సార్‌సిపికి వ్యతిరేకంగా మూడు పార్టీలు ఒక్కతాటిపైకి వస్తే.. వాటికి తోడ్పాటుగా మిగతా పార్టీలు మారడం

  • కూటమి ఇచ్చినన్ని హామీలు ఇవ్వలేకపోవడం, నెరవేర్చలేని హామీని ఇవ్వలేనని చెప్పడం

  • ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ మీద కూటమి నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టలేకపోవడం

  • సచివాలయాలు ఏర్పాటు  చేసి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్న విమర్శను ఎదుర్కోలేకపోవడం

  • కరోనా సమయంలో అందించిన ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోవడం

  • పార్టీలు, వర్గాలు అన్న తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు ఇవ్వడం, ఎన్నికల వేళ సంక్షేమంపై ఎక్కువగా ఆధారపడడం
    అందరికీ ఇవ్వాలన్న తాపత్రయమే తప్ప.. వాటిని ఓటు బ్యాంకుగా మార్చుకోలేకపోవడం

  • సామాజిక సమీకరణంలో భాగంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం

  • మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో న్యాయపరమైన పరిధులు దాటలేకపోవడం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement