నన్ను ఓడించాలని ఎవరినో తెప్పించారు: కొడాలి నాని | Kodali Nani Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

నన్ను ఓడించాలని అమెరికా నుంచి ఎవరినో తెప్పించారు: కొడాలి నాని

Published Thu, Jan 4 2024 8:31 PM | Last Updated on Thu, Jan 4 2024 9:18 PM

Kodali Nani Fires On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్నికల ముందు రా కదలిరా.. ఎన్నికల తర్వాత పో కదలిపో అనడం చంద్రబాబుకు అలవాటేనంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీలను ఓటు బ్యాంకులా వాడుకుని రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. చంద్రబాబు టీడీపీని స్వాధీనం చేసుకున్నాక ఎన్ని రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చాడంటూ కొడాలి నాని ప్రశ్నించారు.

45 రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా చంద్రబాబు బీసీలకు ఇవ్వలేకపోయాడు. సీఎం జగన్‌ 8 రాజ్యసభ సీట్లలో నాలుగు బీసీలకు ఇచ్చారు. 17 ఎమ్మెల్సీలను బీసీలకిచ్చారు. కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులు, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సగం కంటే ఎక్కువ అవకాశం ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇవ్వగలమని టీడీపీ ఛాలెంజ్ చేయగలదా? అంటూ కొడాలి నాని సవాల్‌ విసిరారు.

బీసీలను వెన్నుముక అని చెప్పే చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను వెనకేసుకుని తిరుగుతాడు. ఎన్నికలొచ్చాయి కాబట్టి ఓట్ల కోసం చంద్రబాబుకి బీసీలు గుర్తొచ్చారు. 2024లో చంద్రబాబుకు కచ్చితంగా బీసీలు బుద్ధి చెబుతారు. వాడుకుని వదిలేయడం.. ఓడిపోయే చోట సీట్లివ్వడం చంద్రబాబుకు అలవాటు. వైఎస్‌ జగన్‌ రెక్కల కష్టం మీద వైఎస్సార్‌సీపీ పార్టీ ఏర్పడిందన్నారు. వైఎస్‌ జగన్‌ వల్లే మేం వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యేలుగా గెలిచాం. గెలుపే లక్ష్యంగా అభ్యర్ధులను ఏర్పాటు చేసుకోవడం మా పార్టీ అంతర్గత వ్యవహారం’’ అని కొడాలి నాని చెప్పారు.  

‘‘2019లో మంగళగిరిలో గంజి చిరంజీవికి చంద్రబాబు ఎందుకు సీటివ్వలేకపోయాడు. కొడుకు కోసం బీసీలను తప్పించిన చరిత్ర నీదే చంద్రబాబు. సీఎం జగన్‌ బీసీలకు ఏం చేశాడో ఆయన ఇచ్చిన పదవులే సాక్ష్యం. గుడివాడలో నన్ను ఓడిస్తానని నా చిన్నప్పట్నుంచి చంద్రబాబు చెబుతున్నాడు. ఇప్పుడెవడినో అమెరికా నుంచి తెచ్చాడు ఎన్నికలయ్యాక వాడూ పోతాడు. ఎన్టీఆర్‌కు వారసుడిని నేనా.. వాళ్లా? గుడివాడ ప్రజలే తేలుస్తారు’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్‌.. కాంగ్రెస్‌ యాక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement