
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రామోజీరావుకు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఓపెన్ సవాల్ విసిరారు. ఇళ్ల నిర్మాణాలపై ఈనాడులో తప్పుడు వార్తలు రాశారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావుకి దమ్ముంటే ఆ వార్త నిజమని నిరూపించాలని డిమాండ్ చేశారు.
ఈనాడులో తప్పుడు వార్తలపై మంత్రి జోగి రమేష్ ట్విట్ట్ వేదికగా మండిపడ్డారు. ఈ సందర్భంగా రామోజీరావుకు సవాల్ విసిరారు. రామోజీ.. నేను రూపాయి అవినీతి చేశానని నిరూపించు. లేదంటే ఈనాడు పేపర్ మూసేసి ఇంట్లో కూర్చో. మహిళల మాన ప్రాణాలకు చెలగాటమాడే వారికి అండగా ఉంటారా?. పేపర్ ఉంది కదా అని తప్పుడు వార్తలు రాస్తే ఎలా?. నేను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. లేదంటే ఈనాడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తావా? అని సవాల్ విసిరారు.
ఈనాడు రామోజీరావు నీకు ఓపెన్ ఛాలెంజ్...
— Jogi Ramesh (@JogiRameshYSRCP) October 3, 2022
రూపాయి అవినీతి చేసాను అని నిరూపించు లేదంటే ఆ ఈనాడు పేపర్ మూసేసి ఇంట్లో కూర్చో pic.twitter.com/fyquSiI912