కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్‌ | AP CM YS Jagan Full Speech Highlights And Powerful Punch Dialogues In Ongole Public Meeting, Videos Inside - Sakshi
Sakshi News home page

CM Jagan Ongole Meeting Highlights: వంద మంది సినిమా విలన్ల కన్నా బాబు దుర్మార్గమే ఎక్కువ

Published Fri, Feb 23 2024 12:16 PM | Last Updated on Fri, Feb 23 2024 3:47 PM

CM YS Jagan Full Speech In Ongole Meeting - Sakshi

సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో ఒక్క పేదవాడికీ చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కానీ, మనం మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి రాక్షసుల్లా అడ్డుకున్నారు. పేదలకు మంచి జరగకుండా కోర్టులో 1191 కేసులు వేశారు. చంద్రబాబు కుట్రలను అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇ‍ప్పటికీ కూడా ఇళ్ల స్థలాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారని చెప్పుకొచ్చారు. 

ముఖ్యమంత్రి జగన్‌ నేడు ఒంగోలులో 21వేల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే, ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ‍ప్రారంభించారు. రూ.231 కోట్ల విలువ చేసే భూమిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..
‘మన పేదలకు మంచి మనం మంచి చేస్తుంటే చంద్రబాబులో అసూయ పుట్టుకొస్తోంది. వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందటాడు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని చంద్రబాబు అవమానించాడు. ఇన్ని కుట్రలు చేసి కూడా చంద్రబాబు ఇంకా బరితెగించి రాజకీయాల్లో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. రుణమాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు 650 హామీలిచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు నిసిగ్గుగా కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారు.

చంద్రబాబు దారుణాలు ఎల్లో మీడియాకు కనిపించవు. మన ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్దాలు రాస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా?. చంద్రబాబులాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. ఏం మంచి చేశాడో చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏమీ లేవు. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు. కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు. చంద్రబాబును సమర్థించే వాళ్లు ఏపీలో లేని వాళ్లు మాత్రమే. చంద్రబాబు మాదిరి నాకు నాన్‌రెసిడెంట్స్‌ ఆంధ్రాస్‌ మద్దతు లేదు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి. దళారులు, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు. దేవుడి ఆశీస్సులు, ప్రజలే నా నమ్మకం. 

ఇదే సమయంలో.. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇ‍ళ్ల పట్టాలు ఇచ్చాం. 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశామన్నారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ జరిగాయి. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామన్నారు. 

విద్యావ్యవస్థలో మార్పులు..
మన ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మన ప్రభుత్వంలో పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు. విద్యార్థుల కోసం బైలింగ్వల్‌ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చాం.  నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్‌ రూపురేఖలు మార్చాం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్స్‌ ఇచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్‌ విద్యాబోదన. ప్రభుత్వ స్కూల్స్‌లో ఐబీ విధానం తెచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు తెచ్చాం. మన విద్యార్థులు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదివేలా అడుగులు వేశాం. 

పేదలకు కార్పొరేట్‌ వైద్యం..
పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25లకు పెంచాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌ 3300లకు పెంచాం.  వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఆసుపత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు. రోగులు కోలుకునేవరకు ఆరోగ్య ఆసరా కింద సాయం. పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్‌ విధానం తెచ్చాం. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి. 

రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. ఆర్థిక అంతరాలను తొలగించాం. పేదలకు డీబీటీ ద్వారా రూ.2లక్షల 55వేల కోట్లు అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 75 శాతం లబ్ధి చేకూర్చాం. మన ప్రభుత్వంలో బలహీనవర్గాలకు నామినేటెడ్‌ పదవులు ఇచ్చాం. గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్‌ పదవులు ఇచ్చేవారు. 

పేదలకు పట్టాలు..
రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుంది. భవిష్యత్‌లో రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇవ్వడం వల్ల కబ్జా చేసేందుకు కూడా వీలుపడదు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఉండటం వల్ల సులభంగా బ్యాంక్‌ రుణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పేదల ఆత్మగౌరవం గురించి గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదు. 

రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీ లే అవుట్లు. 60వేల కోట్లతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రవ్యాప్తంగా 71,811 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. మౌలిక సదుపాయాల కోసం ప్రతీ ఇంటికి లక్ష ఖర్చు చేశాం. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులు కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం. ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ 2.5లక్షల నుంచి 15లక్షల వరకు ఉంటుంది. ఒంగోలులో పేదల ఇళ్ల కోసం 210 కోట్లతో భూమి కొనుగోలు చేశాం. మరో 21 కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి చేశాం. ఒంగోలులో తాగునీటి కోసం రూ.334 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశాం. జగనన్న టౌన్‌షిప్‌లో మౌలిక వసతుల కోసం రూ.247 కోట్లు ఖర్చు చేశాం’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement