land papers
-
కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో ఒక్క పేదవాడికీ చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కానీ, మనం మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి రాక్షసుల్లా అడ్డుకున్నారు. పేదలకు మంచి జరగకుండా కోర్టులో 1191 కేసులు వేశారు. చంద్రబాబు కుట్రలను అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇళ్ల స్థలాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నేడు ఒంగోలులో 21వేల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే, ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ప్రారంభించారు. రూ.231 కోట్ల విలువ చేసే భూమిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మన పేదలకు మంచి మనం మంచి చేస్తుంటే చంద్రబాబులో అసూయ పుట్టుకొస్తోంది. వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందటాడు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని చంద్రబాబు అవమానించాడు. ఇన్ని కుట్రలు చేసి కూడా చంద్రబాబు ఇంకా బరితెగించి రాజకీయాల్లో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. రుణమాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు 650 హామీలిచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు నిసిగ్గుగా కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారు. చంద్రబాబు దారుణాలు ఎల్లో మీడియాకు కనిపించవు. మన ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్దాలు రాస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా?. చంద్రబాబులాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. ఏం మంచి చేశాడో చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏమీ లేవు. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు. కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు. చంద్రబాబును సమర్థించే వాళ్లు ఏపీలో లేని వాళ్లు మాత్రమే. చంద్రబాబు మాదిరి నాకు నాన్‌రెసిడెంట్స్ ఆంధ్రాస్ మద్దతు లేదు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి. దళారులు, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు. దేవుడి ఆశీస్సులు, ప్రజలే నా నమ్మకం. ఇదే సమయంలో.. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశామన్నారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు.. మన ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మన ప్రభుత్వంలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు. విద్యార్థుల కోసం బైలింగ్వల్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చాం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్యాబోదన. ప్రభుత్వ స్కూల్స్‌లో ఐబీ విధానం తెచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు తెచ్చాం. మన విద్యార్థులు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదివేలా అడుగులు వేశాం. పేదలకు కార్పొరేట్ వైద్యం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25లకు పెంచాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 3300లకు పెంచాం. వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఆసుపత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు. రోగులు కోలుకునేవరకు ఆరోగ్య ఆసరా కింద సాయం. పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్ విధానం తెచ్చాం. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. ఆర్థిక అంతరాలను తొలగించాం. పేదలకు డీబీటీ ద్వారా రూ.2లక్షల 55వేల కోట్లు అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 75 శాతం లబ్ధి చేకూర్చాం. మన ప్రభుత్వంలో బలహీనవర్గాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం. గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చేవారు. పేదలకు పట్టాలు.. రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుంది. భవిష్యత్‌లో రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల కబ్జా చేసేందుకు కూడా వీలుపడదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండటం వల్ల సులభంగా బ్యాంక్ రుణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పేదల ఆత్మగౌరవం గురించి గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీ లే అవుట్లు. 60వేల కోట్లతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రవ్యాప్తంగా 71,811 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. మౌలిక సదుపాయాల కోసం ప్రతీ ఇంటికి లక్ష ఖర్చు చేశాం. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులు కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం. ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ 2.5లక్షల నుంచి 15లక్షల వరకు ఉంటుంది. ఒంగోలులో పేదల ఇళ్ల కోసం 210 కోట్లతో భూమి కొనుగోలు చేశాం. మరో 21 కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి చేశాం. ఒంగోలులో తాగునీటి కోసం రూ.334 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశాం. జగనన్న టౌన్షిప్లో మౌలిక వసతుల కోసం రూ.247 కోట్లు ఖర్చు చేశాం’ అని తెలిపారు. -
‘పట్టాల’పై పేట్రేగితే సహించను
ఒంగోలు : ‘పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే ఎవరైనా సంతోషిస్తారు.. కానీ అందుకు భిన్నంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం ఈ ప్రక్రియను ఎలా ఆపాలా అంటూ రోజూ తప్పుడు కథనాలు రాయడం ఆశ్చర్యంగా ఉంద’ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల పట్టాల పంపిణీ కోసం రాజకీయ జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి తాను పోరాడుతున్నానని, ఇచ్చిన మాటకు కట్టుబడి కృషిచేస్తుంటే, ఎలాగైనా పట్టాల పంపిణీ నిలిచిపోయేలా కుతంత్రాలు చేస్తూ పేట్రేగితే మాత్రం సహించే ప్రసక్తేలేదని ఆ రెండు పత్రికలపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. స్థానిక నర్సాపురం అగ్రహారం–మల్లేశ్వరపురం రైతుల వద్ద నుంచి జగనన్న కాలనీ కోసం పేదలకు పట్టాలిచ్చేందుకు కొనుగోలు చేసిన భూముల్లో అభివృద్ధి పనులను ఆదివారం బాలినేని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల రాతలను తూర్పారబట్టారు. ఒక్క రూపాయి తీసుకున్నా చెప్పుతో కొట్టండి.. తానేదో రైతుల వద్ద నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు కథనాలు రాయడం ఏమిటంటూ బాలినేని మండిపడ్డారు. ఒక్క రూపాయి తాను తీసుకున్నా తనను చెప్పుతో కొట్టాలన్నారు. ఇప్పటికే భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన డబ్బులు రూ.231 కోట్లు కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమయ్యాయని.. ఇందులో ఇప్పటికే 80 శాతం మందికి నగదు కూడా జమచేశారన్నారు. ఆదివారం కూడా 29 మందికి జమచేసినట్లు తెలిపారు. మిగిలిన కొంత భూమికి సంబంధించిన వివాదాలు ఉండడంతో వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని బాలినేని చెప్పారు. రోడ్లు, విద్యుత్, గుడి, బడి, పార్కులు ఇలా అన్ని రకాల మౌలిక వసతులతో ఒక సిటీని నిరి్మస్తున్నామన్నారు. రైతులు కూడా ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇళ్లు కూడా మంజూరు చేయిస్తా.. ఇక ఈనెల 20 నుంచి 25లోగా 25 వేల మందికి సీఎం వైఎస్ చేతుల మీదుగా పట్టాలను ఇప్పించడమే కాక ఇళ్లు కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తానని బాలినేని హామీ ఇచ్చారు. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు తాను ఇంతగా తాపత్రయపడుతుంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రం డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఇవ్వరంటూ అడ్డగోలుగా కథనాలు రాశారని, తీరా నేడు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయగానే కాగితాలు మాత్రమే ఇస్తారు, స్థలం చూపరు అంటూ వేరే కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లకు భూసేకరణ సమయంలో భూములను ఎలా సేకరించారో, ఇప్పుడు భూముల కొనుగోలు ఎలా జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు. అడ్డుకుంటే ముట్టడిస్తా.. ఏదో ఒక రూపంలో పేదల పట్టాలను అడ్డుకోవాలని చూస్తే మాత్రం సహించేదిలేదని, ఇంటికి ముగ్గురు చొప్పున 25 వేల పట్టాలకు సంబంధించి 75 వేల మందితో ఆ రెండు పత్రికల కార్యాలయాలను సైతం ముట్టడిస్తానని బాలినేని హెచ్చరించారు. పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని తనపై ఎన్ని కేసులు పెట్టినా డోంట్ కేర్ అని స్పష్టంచేశారు. సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్‌రావు తదితరులు ఉన్నారు. నేను పార్టీలోనే ఉంటా.. అనంతరం.. టంగుటూరు మండలం అనంతవరం గ్రామంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ సచివాలయ సముదాయాన్ని మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తో కలిసి బాలినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిమూలపు సురే‹Ùను కొండపి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పారు.. పార్టీ తల్లిలాంటిది.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే.. అధికారం ఉంటేనే ఏ పనైనా చేసుకోగలం. మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయితే చాలు. నా గుండె నుంచి వస్తున్న మాటలివి. నేను పార్టీలోనే ఉంటాను’’ అని బాలినేని స్పష్టంచేశారు. జగనన్న నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. -
నూజివీడులో సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్ విజువల్స్
-
చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Live Updates.. ►నూజివీడులో అర్హులకు పట్టాలు ప్రదానం చేసిన సీఎం జగన్. సీఎం జగన్ మాట్లాడుతూ.. ►ప్రజలకు మంచి చేసి చంద్రబాబు సీఎం కాలేదు. చంద్రబాబుకు మంచి చేద్దామనే ఆలోచనే లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే. బాబు హయాంలో అందరినీ మోసం చేశాడు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అబద్దాలతో వస్తారు.. ప్రతీఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ►తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తుకు తెచ్చుకోండి. ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారు. ఆయన అన్న మాటలను గుర్తుకుతెచ్చుకోండి. ►ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్లోని నాయకుడు చంద్రబాబు. కోడలు మగ పిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అన్నది చంద్రబాబే. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతీ ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు మోసపోకండి. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ తోడేళ్లు అందరూ ఏకమవుతారు. ప్రజల దీవెనలు ఉన్నంత వరకూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోను. ►రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నాం. కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నాం. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. ►మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం. అసైన్డ్ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నాం. చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించాం. ►ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం. లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం. దళిత వర్గాల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్మశాసవాటికలకు స్థలాలు కేటాయించాం. ►నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. నేడు చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు. 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా గెలుస్తుంది. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడు.. ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి. లోకేశ్ ఏదైనా ఇండస్ట్రీ ప్రారంభిస్తానంటే సీఎం జగన్‌కు చెప్పి అనుమతులు ఇప్పిస్తాను. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘతన సీఎం జగన్‌దే. దివంగత వైఎస్సార్ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదు. నూజివీడుకు చంద్రబాబు చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రెండు సీట్లు కూడా రావు. ►నూజివీడు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ►నూజివీడు బయలుదేరిన సీఎం జగన్ ►కాసేపట్లో అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం ►భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నేడు నూజివీడు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు. సీఎం పర్యటన ఇలా.. ► ఉదయం 10.25 గంటలకు నూజివీడులోని హెలీప్యాడ్‌కు చేరుకుని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ► 11.10 నుంచి 12.25 గంటల వరకు భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేసి సభలో ప్రసంగిస్తారు. ► 12.50 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని స్థానిక నాయకులు, ప్రజలను కలుసుకుంటారు. అనంతరం 1.55 గంటలకు తాడేపల్లి పయనం కానున్నారు. గోడు విన్నారు.. పోడు భూములిచ్చారు సాక్షి, అమరావతి: గిరిజనుల గోడును ఆలకించి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం(ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్) ద్వారా పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. గిరిజనులకు పోడు భూముల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా నిలిపారు. 2008 నుంచి 2019 వరకు గత ప్రభుత్వాలు 95,649 గిరిజన కుటుంబాలకు 2,33,410 ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చాయి. వీటిల్లో గత పదకొండేళ్లలో ఇచ్చిన మొత్తం పట్టాల్లో అత్యదికంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంపిణీ చేసినవే కావడం గమనార్హం. వాస్తవానికి పోడు భూములకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్సారే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నరేళ్లలో ఏకంగా మొత్తం 1,30,368 కుటుంబాలకు 2,87,710 ఎకరాలకు పట్టాలిచ్చి పేదలకు మేలు చేయడంలో తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని నిరూపించుకున్నారు. వీటిలో 1,29,842 మందికి 2,19,763 ఎకరాలు, 526 సామూహిక(కమ్యూనిటీ) టైటిల్స్ ద్వారా 67,947 ఎకరాల పోడు భూములకు పట్టాలుగా పంపిణీ చేయడం విశేషం. డీకేటీ పట్టాల పంపిణీ.. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని (రిజర్వ్ ఫారెస్ట్ కాని భూమి) వారు సాగు చేసుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాల రూపంలో పంపిణీ చేస్తుంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా 26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల భూమిని పంపిణీ చేయడం గమనార్హం. -
HMDA: భూములు వేలం.. హెచ్‌డీఎంకు బిడ్డర్ల ఝలక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు బిడ్డర్లు హ్యాండ్ ఇచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇటీవల ఈ-వేలంలో ప్లాట్లకు పాటపాడి బిడ్డర్లు డబ్బులు చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఆరు లేఅవుట్లలో ఏకంగా 497 మంది డిఫాట్లర్టుగా మారడం గమనార్హం. కాగా, డబ్బులు చెల్లించేందుకు నిర్ణీత గడువు కంటే ఎaక్కువ సమయం ఇచ్చినా బిడ్డర్లు మిగతా వాయిదాలు చెల్లించలేదు. దీంతో, ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏలో ఈ-వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారిలో చాలామంది డిఫాల్టర్లుగా నిలిచారు. ఆరు లేఅవుట్లకు సంబంధించి 497 మంది చెల్లింపులు చేయలేక చేతులెత్తేశారు. వారికి నిర్ణీత గడువు కంటే మరికొంత సమయం ఇచ్చినా సొమ్ము చెల్లించలేదు. ఈ క్రమంలో చేసేదేమీ లేకపోవడంతో ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. ► ఇక, మోకిలలో ఇటీవల నిర్వహించిన ఈ-వేలంలో చదరపు గజం రూ.లక్ష పలకడం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా అధిక ధరకు ప్లాట్లు దక్కించుకున్న చాలామంది డబ్బులు చెల్లించడంలో వెనకడుగు వేశారు. ఒక్క మోకిలలోనే 148 మంది వరకు డిఫాల్టర్లుగా మిగిలారు. షాబాద్‌లో 50 ప్లాట్లకుగాను కేవలం 10 మందే చెల్లింపులు చేశారు. తొర్రూరులో 504 ప్లాట్లకు 114 మంది డబ్బులు కట్టలేదు. మిగతా లేఅవుట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ►ఆరు నెలల్లో మోకిల, మేడిపల్లి, బాచుపల్లి, బహదూర్‌పల్లి, తొర్రూరు, షాబాద్ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసింది. వేలంలో పాల్గొనాలంటే ప్రతి ప్లాటుకు తొలుత రూ.లక్ష ధరావతు చెల్లించాలి. కొన్నిచోట్ల ఈ మొత్తం తక్కువ ఉంటుంది. అలా వేలంలో ప్లాటు దక్కించుకున్న తర్వాత మిగతా మొత్తం కట్టకుంటే డిఫాల్టర్లుగా తేల్చి ఆ ధరావతును జప్తు చేస్తారు. అంతేకాక డిఫాల్టర్లు భవిష్యత్తులో వేలంలో పాల్గొనలేరు. -
తిమ్మాపురంలో ఎమ్మెల్యే అనితకు చేదు అనుభవం
-
మాయం
బ్రహ్మంగారిమఠం: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 145 పాస్ పుస్తకాలు మాయం అయ్యాయి. మండలంలో ఈ విషయం చర్చనీయాంశమైంది. రేకులకుంట గ్రామ పంచాయితీ పరిధిలోని జెడ్.కొత్తపల్లె గ్రామంలో ప్రభుత్వ బంజరు భూమి పట్టాలు పొందిన లబ్ధిదారులకు సంబంధించిన 145 పట్టాదారు పాసుపుస్తకాలు స్థానిక వీఆర్ఓ ప్రతాప్‌రెడ్డి స్వాధీనంలో ఉండేవి. మూడు రోజుల క్రితం రెవెన్యూ కార్యాలయంలోని ఆయన ట్రంకుపెట్టెలో నుంచి ఇవి మాయమైనట్లు సమాచారం. ఇవి చోరీకి గురయ్యాయా.. లేక మాయం చేశారా అనేది తెలియాల్సి ఉంది. బ్రహ్మంసాగర్ ముంపు గ్రామాలకు చెందిన వారికి డీకేటీ పట్టాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వటానికి పట్టాదారు పాసుపుస్తకాలు సిధ్దం చేశారు. భూములు చూపించిన అనంతరం పాసుపుస్తకాలు పంపిణీ చేసేందుకు తహశీల్దార్ సుబ్బరామయ్య సిద్ధంగా ఉండగా ఒక్కసారిగా ఇవి మాయమయ్యాయి.