ఒంగోలు టౌన్: ఒంగోలుకు చెందిన ఓ చిన్నారి ఎవరెస్ట్ ఎక్కాడు. ఆ చిన్నోడి ధైర్య సాహసాలు మెచ్చుకున్న నేపాల్ రాయబారి ఎవరెస్ట్ డే రోజున అవార్డుతో సత్కరించారు. ఒంగోలులోని సంతపేటకు చెందిన వెలగపూడి వెంకటరమణ ఏపీ ట్రాన్స్‌కో లో ఎస్‌ఈ గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన అల్లుడు అమిత్, కూతురు అనురాధ ఇంజినీర్లుగా మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి అక్షజ్ ఉడియావాల(6) అనే కుమారుడున్నాడు.
అక్షజ్ గతేడాది ఎవరెస్ట్ శిఖరంలోని బేస్ క్యాంపు వరకు అంటే 5,364 మీటర్ల ఎత్తు వరకు ఎక్కి అక్కడ భారత జాతీయ జెండాను ఎగరేశాడు. ప్రతి ఏడాది మే 29న ఎవరెస్ట్ డే సందర్భంగా మస్కట్‌లోని నేపాల్ రాయబార కార్యాలయంలో జరిగిన ఎవరెస్ట్ డే కార్యక్రమానికి అక్షజ్ తో పాటు అతడి తల్లిదండ్రులకు ఆహ్వానం అందింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అక్షజ్ తన అనుభవాలను అక్కడ వివరించాడు. అక్షజ్‌కు నేపాల్ రాయబారి దోర్నాథ్ ఆర్యల్ సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేట్ అవార్డును ప్రదానం చేశారు. అక్షజ్ తల్లిదండ్రులు అమిత్, అనురాధలను సత్కరించారు.
ఇది కూడా చదవండి: హజ్ యాత్రకు జూన్ 7న తొలి విమానం
Comments
Please login to add a commentAdd a comment