వేధింపులు పోలీసుల దృష్టికి తేవాలి | Vasireddy Padma Comments About Harassment of Womens | Sakshi
Sakshi News home page

వేధింపులు పోలీసుల దృష్టికి తేవాలి

Published Tue, Jun 30 2020 5:20 AM | Last Updated on Tue, Jun 30 2020 5:20 AM

Vasireddy Padma Comments About Harassment of Womens  - Sakshi

సాక్షి, గుంటూరు/పట్నంబజారు(గుంటూరు): మహిళలు, యువతులకు సంబంధించి ఎటువంటి ఘటన జరిగినా త్వరితగతిన చర్యలు చేపట్టడంతో పాటు శిక్షలు తప్పవని, బాధితులు నిర్భయంగా వేధింపుల ఘటనలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ దృఢ లక్ష్యంతో దిశ పోలీసు స్టేషన్‌లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారని, వాటి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.

గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని నగ్న వీడియోలను పోర్న్‌ వెబ్‌సైట్స్, ఇన్‌స్ట్రాగామ్‌లలో పెట్టి వేధింపులకు గురిచేయడం ఎంతో బాధాకరమన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సోమవారం వచ్చిన ఆమె అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డితో సమావేశమయ్యారు. ఈ కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఘటనపై ఈనెల 20న ఫిర్యాదు అందిన నేపథ్యంలో సాంకేతికపరంగా దర్యాప్తు, నిందితులను విచారణ చేసి వరుణ్, కౌశిక్‌ను 27న అరెస్ట్‌ చేశారన్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్‌ చేసిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement