దొండపర్తి (విశాఖ దక్షిణ): ఓ బాలికపై లైంగిక దాడి కేసులో 73 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక తల్లితో కలిసి నివాసముంటోంది. ఒక రోజు పాఠశాల నుంచి వచ్చి ఇంటి బయట స్నేహితులతో ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన కోలాటి బాలయోగి (73) బాలికకు మాయమాటలు చెప్పి అతడి ఇంటికి తీసుకువెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇలా సుమారు ఐదు నెలల పాటు బాలికను హింసించాడు. బాలికకు తరచూ కడుపునొప్పి వస్తుండడంతో తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్య పరీక్షలో అసలు విషయం తేలింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దిశా పోలీస్‌స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ దర్యాప్తు చేసి నిందితుడు బాలయోగిని అరెస్టు చేసి పూర్తి ఆధారాలతో పోక్సో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆధారాలను పరిశీలించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.రామశ్రీనివాస్ ముద్దాయి బాలయోగికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు నష్టపరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వాలని తీర్పు వెలువరించారు.
బాలికపై లైంగిక దాడి కేసులో వృద్ధుడికి 20 ఏళ్ల జైలు
Published Tue, Oct 18 2022 4:53 AM | Last Updated on Tue, Oct 18 2022 4:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment