టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాతగానీ ఏమీ మాట్లాడలేమని, అది తమకు ఇంకా అందలేదని రేవంత్ తరఫు న్యాయవాదులు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు రూ.50 లక్షలు ఇస్తూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ రేవంత్ రెడ్డిని కలుసుకునేందుకు న్యాయవాదులు సోమవారం తెల్లవారుజామునే బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు.
రేవంత్ డబ్బు కట్టలతో పడ్డుబడ్డ వీడియోలపై స్పందిస్తూ 'అధికారికంగా ఎలాంటి సీడీలు విడుదల చేయలేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. రిమాండ్ రిపోర్టు వచ్చిన తర్వాతగానీ ఏ ఆధారలతో మా క్లైంటును అరెస్టుచేశారో తెలుస్తుంది. ఆ తర్వాతగానీ ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై మాకొక స్పష్టత వస్తుంది' అని రేవంత్ తరఫు న్యాయవాదులు సమాధానమిచ్చారు.
'రిమాండ్ రిపోర్ట్ అందిన తర్వాతే ఏదైనా చెప్పగలం'
Published Mon, Jun 1 2015 7:27 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement