ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్ర రెడ్డికి ఏసీబీ తాజాగా నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్:ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్ర రెడ్డికి ఏసీబీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సెక్షన్ 160 సీఆర్పీసీ కింద రాఘవేంద్రరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. ఆదివారం సాయంత్రం నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు తెలుగు యువత నాయకుడు పుల్లారావుకు కూడా ఏసీబీ నోటీసులు పంపింది.
అంతకుముందు ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు టీడీపీ నేత ప్రదీప్కు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఓటకు కోట్లు కేసులో ఉన్నవారి సంఖ్య మరింత పెరుగుతుండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.