Timayya
-
కుమార్తెకు ఇష్టం లేని వ్యక్తితో వివాహ ప్రయత్నం
తనయురాలితో కలిసి భార్యను హత్య చేసిన భర్త బెంగళూరు(బనశంకరి) : కుమార్తెకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం చేసేందుకు యత్నించిన భార్యను తనయురాలితో కలిసి భర్త హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చి పెట్టారు. ఈ ఉదంతం ఆదివారం నగరంలో వెలుగు చూసింది. హెబ్బడగెరెలో తిమ్మయ్య, మంజుల(55) నివాసం ఉంటున్నారు. వీరికి పవిత్ర, రాణి అనే కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పవిత్ర భర్త ఓ నేరం కేసులో జైలు పాలు కాగా పవిత్ర తల్లివద్దనే ఉంటోంది. రెండో కుమార్తె రాణి ఓ యువకుడిని ప్రేమించింది. అతనితో వివాహం చేయాలని కోరగా తల్లి అంగీకరించలేదు. మరో వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించింది. ఇది భర్తకు కూడా ఇష్టం లేదు. దీంతో తిమ్మయ్య తన భార్యను అంతమొందించేందుకు పథకం రూపొందించాడు. ఈమేరకు రాణితో కలిసి మంజులను హత్య చేసి ఇంటి వెనుక పూడ్చి పెట్టారు. తన తల్లి కనిపించడం లేదని పెద్ద కుమార్తె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి రాణి, తిమ్మయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తామే మంజులను హత్య చేసినట్లు నిర్ధారించడంతో ఆదివారం ఘటనా స్థలానికి చేరుకొని మంజుల మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితులను అరెస్ట్ చేశారు. -
రాష్ట్రానికి మీరే గర్వకారణం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కామన్వెల్త్ క్రీడల్లో అయిదు రజత పతకాలను గెలుచుకున్న క్రీడాకారులను హోం మంత్రి కేజే. జార్జ్, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డిలు సత్కరించారు. కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ (కేవోఏ) గురువారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పీఎన్. ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), అశ్విని పొన్నప్ప (షటిల్ బ్యాడ్మింటన్), వీఆర్. రఘునాథ్, ఎస్వీ. సునీల్, నిఖిన్ తిమ్మయ్య (హాకీ)లు సత్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జార్జ్, క్రీడాకారుల సాధన అపూర్వమని కొనియాడారు. మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఓడిపోయిన వారు నిరాశ చెందరాదని ధైర్యం చెప్పారు. కేవోఓ అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ ఇలాంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలను గెలుచుకున్న వారికి నగదు బహుమతితో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారని గుర్తు చేశారు. నివేశనంతో పాటు స్వర్ణ పతక విజేతలకు రూ.25 లక్షలు, రజత పతక విజేతలకు రూ.10 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పారని వెల్లడించారు. అక్టోబరులో నిర్వహించే బ్రహ్మాండమైన కార్యక్రమంలో ఈ బహుమతులు అందజేస్తారని తెలిపారు.