
నిర్మాతగా మారిన వనిత
ప్రఖ్యాత నటులు ఎంజిఆర్, శివాజి, రజని, కమల్‌ల పేర్లు జపిస్తున్నారు నటి వనిత. నట దంపతులు విజయకుమార్, మంజుల వారసురాలైన ఈమె గురించి తెలియనివారుండరు. ఎందుకంటే ఆ మధ్య ఈమె పేరు వార్తల్లో బాగా నానింది. హీరోయిన్‌గా కొన్ని చిత్రాలు చేసిన వనిత, ఆకాష్ అనే వ్యక్తిని వివాహమాడి కొంతకాలం తరువాత అతని నుంచి విడాకులు పొం దారు. ఆ తరువాత రాజన్ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సంసార జీవితం తరువా త విడిపోయారు. ఈమెకు విజయ్ శ్రీహరి, జెని త అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పెళ్లి, విడాకుల వ్యవహారాల్లో పోలీసుస్టేషన్లు, కోర్టులు అంటూ వార్తల్లో కెక్కిన నటి వనిత తాజాగా నిర్మాతగా అవతారమెత్తారు.
ఈమె నిర్మిస్తున్న చిత్రానికి ఎంజీఆర్, శివాజి, రజని, కమల్ అనే పేరును నిర్ణయించారు. నృత్య దర్శకుడు రాబర్ట్ ను హీరోగా నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌దేవా సంగీతబాణీలందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం స్థానిక వడపళనిలోని ఆర్ కేవీ స్టూడియోలో జరిగింది. చిత్ర ఆడియోను సీని యర్ సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవా తండ్రి అయిన దేవా ఆవిష్కరించారు. వనిత మాట్లాడు తూ వారాంతరాల్లో స్నేహితులందరూ కలుసుకు ని సరదాగా గడుపుతామన్నారు. అలా ఒకరోజు రాబర్ట్ తన వద్ద మంచి కథ ఉంది సినిమా చేద్దాం అని చెప్పారన్నారు.
ఆ కథ తనకు అంతగా నచ్చకపోవడంతో ఆయన్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక మంచి నిర్మాత కోసం ప్రయత్నిద్దాం అని చెప్పానన్నారు. విషయం అర్థం చేసుకున్న రాబర్ట్ మరో కథను తయారు చే సినట్లు వివరించారు. పూర్తి వినోదభరిత అంశాలతో కూడిన ఆ కథ నచ్చడంతో చిత్ర నిర్మాణానికి సిద్ధం అయ్యానన్నారు. ఆ కథతో తెరకెక్కిస్తున్న చిత్రమే ఎంజీఆర్, శివాజి, రజని, కమల్ అని తెలిపారు. కథకు నప్పడంతోనే ఈ చిత్రానికి ఆ పేరును నిర్ణయించినట్లు వివరించారు. ఈ ఆడియోను శ్రీ స్టూడియో సంస్థ ద్వారా సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా మార్కెట్‌లోకి విడుదల చేయటం విశేషం.