సినిమాల్లోకి స్టార్ల వారసులు వరదల్లా వెల్లువెత్తుతున్న వేళ సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల మాత్రం ఎందుకనో కెరీర్‌లో రాణించలేకపోయింది. నీలకంఠ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మెరిశారే తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే తాను ఎందుకు ఫెయిల్ కావాల్సి వచ్చిందో చెబుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫేస్‌బుక్ లో ఓ వీడియోను పోస్ట్ షేర్ చేశారు.