మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్ సిస్టర్ | Mahesh babu sister manjula set for direction debut | Sakshi
Sakshi News home page

మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్ సిస్టర్

Published Sun, Oct 30 2016 10:16 AM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్ సిస్టర్ - Sakshi

మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్ సిస్టర్

సౌత్ సినీ రంగంలో ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా కనిపిస్తోంది. మంచు లక్ష్మీ లాంటి వారు తమ మార్క్ చూపించగా మరింత మంది సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. అయితే చాలా క్రితమే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది ఘట్టమనేని వారసురాలు మంజులు. కృష్ణ కూతురిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంజుల నటిగాను గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. షో లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది.

అయితే నిర్మాతగా వరుస ఫెయిల్యూర్స్ రావటంతో కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. తాజాగా మరోసారి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్లాన్ చేస్తోంది మంజుల. అయితే ఈ సారి నటిగానో, నిర్మాతగానో కాకుండా దర్శకురాలిగా సత్తాచాటేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఓ కథ రెడీ చేసిన మంజుల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement