జీతాలు పెంచాలని ఆశా కార్యకర్తల ధర్నా | Starbucks hope to increase the salaries of workers | Sakshi
Sakshi News home page

జీతాలు పెంచాలని ఆశా కార్యకర్తల ధర్నా

Published Fri, Mar 20 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

Starbucks hope to increase the salaries of workers

చిక్కబళ్లాపురం: నెలసరి వేతనాలను పెంచాలం టూ ఆశా, అక్షర దాసోహ కార్యకర్తలు గురువా రం ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాల యం ఎదుట చేపట్టిన ఈ కార్యక్రమానికి సీఐ టీయూ నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా అక్షర దాసోహ తాలూకా సంచాలకురా లు మంజుల మాట్లాడుతూ... అక్షర దాసోహ కార్యకర్తలకు నెలకు గౌరవ వేతనంగా రూ. 1800, ఆశా కార్యకర్తలకు రూ. 1700 చెల్లిస్తున్నారని తెలిపారు.

ఈ వేతనంతో జీవనం గడపడం దుర్భరంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనంగా రూ.పది వేలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్‌కు వి నతిపత్రం అందజేశారు. అంతకు నగరంలో కా ర్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటలక్షుమమ్మ, నరసమ్మ, శోభా, భారతి, రాధమ్మ, సీపీఎం సంచాలకుడు ముని కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement