ఊయలే ఉరితాడైంది..
ఎంపీపీ అధ్యక్షురాలి తనయుడి మృతి
దండేపల్లి : ఊయల తాడు ఉరి తాడుగా మారి పదేళ్ల బాలుడిని బలితీసుకుంది. ఊయలూగుతుండగా ప్రమాదవశాత్తు తాడు మెడకు బిగుసుకుని దండేపల్లి ఎంపీపీ అధ్యక్షురాలు గోళ్ల మంజుల, రాజమల్లుల కుమారుడు రిషీత్(10) మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఎంపీపీ అధ్యక్షురాలు గోళ్ల మంజుల గ్రామసభలో పాల్గొనడానికి వెళ్లారు. ఆమె భర్త రాజమల్లు ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాడు. వారి కుమారుడు రిషీత్ మేదరిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.
ఆందోళన నేపథ్యంలో సోమవారం పాఠశాలకు బంద్ కావడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నాడు. ఇంటి ఆవరణలోని ఊయలలో నిలబడి ఊగుతూ ప్రమాదవశాత్తు కిందికి జారాడు. దీంతో ఊయల తాడు మెడకు చుట్టుకుని బిగుసుకు పోరుుంది. దీంతో ఊపిరాడక రిషీత్ చనిపోయూడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయూడు. పక్కింటి వాళ్లు వచ్చి చూడగా రిషీత్ ఊయల తాడుకు చనిపోయి కనిపించాడు. ఈ విషయం రాజమల్లుకు తెలియజేయడంతో వెంటనే ఆయన వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే చనిపోరుునట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యూరు. రిషీత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చి కంటతడిపెట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దండేపల్లిని మంచిర్యాల జిల్లాలోనే ఉంచాలని చేపడుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం మండలంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బడి లేకపోవడంతో రిషీత్ ఇంటివద్దే ఉండిపోయాడు. తండ్రి ఇదే ఆందోళనలో పాల్గొనడానికి వెళ్లగా.. తల్లి గ్రామసభకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది.