
కెప్టెన్ ఆన్ డ్యూటీ
మంజుల ప్రేక్షకులకు ఎలా తెలుసు? సూపర్‌స్టార్ కృష్ణ కూతురిగా తెలుసు... మహేశ్‌బాబు సిస్టర్‌గా తెలుసు... నటిగా, నిర్మాతగా తెలుసు! కానీ, ఆమెలో ఓ దర్శకురాలు ఉన్నారు. ఆవిణ్ణి త్వరలో మనకు పరిచయం చేయనున్నారు మంజుల. సందీప్ కిషన్ హీరోగా పి. కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్న సినిమాతో మంజుల దర్శకురాలిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.
బుధవారం గోవాలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్‌డే కెప్టెన్ సీటులో కూర్చున్న మంజుల కెమెరాలో ఫ్రేమ్ చెక్ చేసుకుంటున్న స్టిల్‌నే మీరు చూస్తున్నారు. నెల రోజుల పాటు గోవాలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుందట. నెక్స్›్ట లొకేషన్ హైదరాబాదే. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రధన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్, త్రిధా చౌదరి హీరోయిన్లు.