గుట్టుగా రెండో వివాహం | second marriage as confidentiality | Sakshi
Sakshi News home page

గుట్టుగా రెండో వివాహం

Published Sat, Oct 15 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

గుట్టుగా రెండో వివాహం

గుట్టుగా రెండో వివాహం

చితకబాదిన మొదటి భార్య, బంధువులు

 

దొడ్డబళ్లాపురం: గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకుని కాపురం చేస్తున్న వ్యక్తిని, అతడి రెండో భార్యను మొదటి భార్య, బంధువులు కలిసి చెప్పులు, చీపుర్లతో చితకబాదారు. ఈ సంఘటన దేవనహళ్లి తాలూకా చీమాచనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. చీమాచనహళ్లికి చెందిన నవీన్‌కు, ఇదే తాలూకా పెద్దనహళ్లికి చెందిన మంజులతో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్య పురుడుకు పుట్టింటికి వెళ్లగా నవీన్ పెద్దనహళ్లికి చెందిన మరో యువతి ప్రియాంకను గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకొని చీమాచనహళ్లిలో కాపురం పెట్టాడు. విషయం కాస్త మొదటి భార్య మంజుల, కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది.


శుక్రవారం రోజు నవీన్,ప్రియాంక ఇద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో వెళ్లి  చెప్పులతో, చీపుర్లతో చితకబాదారు.   మొదటి వివాహానికి ముందు నుంచే తామిద్దరం పరస్పరం ప్రేమించుకుంటున్నామని, అందుకే వివాహం చేసుకున్నానని ప్రియాంక తేల్చి చెప్పింది.  చెన్నరాయపట్టణ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. ఇరు వైపులనుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement