
సాక్షి, సినిమా : సినిమాల్లోకి స్టార్ల వారసులు వరదల్లా వెల్లువెత్తుతున్న వేళ సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల మాత్రం ఎందుకనో కెరీర్‌లో రాణించలేకపోయింది. నీలకంఠ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మెరిశారే తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే తాను ఎందుకు ఫెయిల్ కావాల్సి వచ్చిందో చెబుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫేస్‌బుక్ లో ఓ వీడియోను పోస్ట్ షేర్ చేశారు.
ఫాలో యువర్ హార్ట్ అంటే మనస్సుకు నచ్చిందే చేయండి అంటూ మంజుల వీడియో ద్వారా తన భావాలను పంచుకున్నారు. ''మొదటినుండీ నటించాలనే అనుకున్నాను. కాని కుదర్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాను. నేను నటించి ఫెయిల్ అవ్వడం వేరు. కాని అసలు నాకు అవకాశమే రాలేదు. దీనంతటికి కారణం మా ఫ్యామిలీ.. ఫ్యాన్స్ అనిపించింది.(అప్పట్లో కృష్ణ అభిమానులే ఆమెను హీరోయిన్ కాకుండా అడ్డుకున్నారనే టాక్ వినిపించింది). కానీ ఆలోచిస్తే దీనంతటికీ బాధ్యురాలిని నేనేనని ఇప్పుడు అర్థమౌతోంది. సమాజం కోసం కాదు నా కోసం నేను ఆలోచించటం మొదలుపెట్టా'' అంటూ మంజుల వివరించారు.
''ఆ తరువాత నాకు నచ్చింది నేను చేయడం మొదలెట్టాను. ఇప్పుడు నా హృదయాన్ని ఫాలో అవుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. గమ్యం ముఖ్యంకాదు.. ప్రయాణమే ముఖ్యం. మనసుకు నచ్చింది చేస్తే ఏదైనా సాధించొచ్చు'' అంటూ ముగించింది. ఇక సోదరికి విషెస్ చెబుతూ ఆ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఆలోచన అద్భుతంగా ఉందంటూ సందేశం ఉంచాడు. నటి రకుల్ ప్రీత్ కూడా ఈ వీడియోను షేర్ చేయటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment