
తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో అపూర్వ విజయాలను, సరికొత్త సాంకేతికతలను అందించిన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో తార తెరకు పరిచయం అవుతోంది. గతంలో కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా పలు చిత్రాల్లో నటించగా.. ప్రస్తుతం మహేష్ బాబు సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. కృష్ణ కూతురు మంజుల కూడా వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకొని.. ప్రస్తుతం దర్శకురాలిగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు.
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాతో మూడోతరం నుంచి మహేష్ తనయుడు గౌతమ్ కూడా వెండితెరకు పరిచయం అయ్యాడు. తాజాగా మంజుల కూతురు కూడా వెండితెర మీద సందడి చేయనుంది. తన స్వీయ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన కూతురు జాన్వీ కీలక పాత్రలో నటింస్తున్నట్టుగా ప్రకటించింది మంజుల. లోకేషన్ లో జాన్వీ సందీప్ తో షూటింగ్ లో ఉండగా తీసిన ఫొటోను కూడా ట్వీట్ చేసింది. మంజుల నటిగా పరిచయం అయిన సమయంలో సూపర్ స్టార్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి మంజుల కూతుర్ని ఘట్టమనేని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment