
తల్లిదండ్రులతో...అనుష్క
సినిమా రిలీజ్ ఉన్నప్పుడు, ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్‌లో తప్ప ఎక్కువగా కనిపించరు అనుష్క. చాలా శాతం లో ప్రొఫైల్‌లో ఉంటారామె. తన ఫ్యామిలీ విశేషాలను, ఫొటోలను కూడా ఎక్కువగా పంచుకోరు. తాజాగా తన ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సోమవారం అనుష్క తండ్రి పుట్టినరోజు. ఈ సందర్భంగా పక్కన ఉన్న ఫొటోను షేర్ చేసి ‘‘పిల్లలను మీ అంత జాగ్రత్తగా పెంచుతూ, ప్రేమను పంచుతూ, ధైర్యం నింపుతూ, ప్రోత్సహించే నాన్నను నేనెక్కడా చూడలేదు. మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇవాళ మీ పుట్టినరోజు. మీ నవ్వే మా అందరి ఆనందం’’ అని పేర్కొన్నారు అనుష్క.
Comments
Please login to add a commentAdd a comment