చంద్రుడిపై ఫ్యామిలీ ఫొటో
లండన్: మీరు పక్కన చూస్తున్న చిత్రంలో ఏం కనిపిస్తుందో గమనించారా.. అందులో ఏముందిలే.. బూడిద, ఒక ఫొటో, పాదముద్రలు, పక్కనే ఏదో వాహనం పోయినట్లు అని అనుకుంటున్నారా.. అయితే మీరు భ్రమపడినట్లే. ఎందుకంటే ఇది మాములు చిత్రం కాదు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న నిజ చిత్రం. బూడిద మాదిరిగా కనిపిస్తున్న ఆ మట్టి చంద్రుడి మీదదే. 1972లో అపోలో 16 ద్వారా చంద్రుడిపై కాలుపెట్టిన చార్లెస్ డ్యూక్ తనకు గుర్తుగా రెండు మూడు అడుగులు వేయడమే కాకుండా ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోయేలా తన కుటుంబంతో కలిసి దిగిన ఒక ఫొటోని కూడా వదిలేసి వచ్చారు.
అంతేకాకుండా అది ఎప్పటికీ చెరిగిపోకుండా దానికి ప్రత్యేక పాలిథిన్ కవర్లో అమర్చారు. అలా ఎంతమంది జ్ఞాపకాలు పదిలంగా అందనంత దూరంలో ఉంటాయో మీరే ఊహించుకోండి. నిజంగా వ్యోమగామి చార్లెస్ డ్యూక్ వచ్చిన ఆలోచన అద్భుతం కదా..! వీలయితే, మీరు ప్రయత్నించండి చూద్దాం.