‘టార్గెట్‌ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’ | Yashasvi Jaiswal Winning Comments I Have 3 Overs Target Vs Mumbai Indians | Sakshi
Sakshi News home page

Yashasvi Jaiswal: ‘టార్గెట్‌ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’

Apr 8 2026 7:53 AM | Updated on Apr 8 2026 8:47 AM

Yashasvi Jaiswal Winning Comments I Have 3 Overs Target Vs Mumbai Indians

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ మాట్లాడాడు.

‘పవర్ ప్లే మాకు మూడు ఓవర్లు మాత్రమే అన్న విషయం నా మైండ్‌లో ఉంది. అందుకే బౌలర్లు ఎవరొచ్చినా ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నా. తొలి ఓవర్ దీపక్ చాహర్ బౌలింగ్‌కు వస్తున్నాడని తెలుసుకొని అతడిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఆ తర్వాత బుమ్రా బాయ్ బౌలింగ్‌కు వచ్చాడు. బుమ్రా సంగతి వైభవ్ సూర్యవంశీ చూసుకుంటాడులే అని మనసులో అనుకున్నా. 

ఆ తర్వాత ఎవరొచ్చినా ఇదే ప్లాన్ అమలు చేయాలని చూశాం. మూడు ఫార్మాట్లలో ఇదే తరహా ఆటతీరును ఆడొచ్చా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే నేను ఆడే ప్రతీ మ్యాచ్‌లో బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ప్రతీ మ్యాచ్‌లో వినూత్నమైన షాట్లను ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు.

 అతడు ఆడుతున్న తీరు అమోఘం. అతడు కష్టపడుతున్నాడు. వచ్చీ రాగానే భారీ సిక్సర్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాడు. ఆటతీరు మార్చుకోమని చెప్పలేను కానీ భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని ఉంది. వైభవ్ సూర్యవంశీకి స్వేచ్ఛనిచ్చాం. ఆ స్వేచ్ఛను అతను చక్కగా ఆస్వాదిస్తూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 

ప్రతీసారి మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ముందు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఈ సీజన్‌లో వరుసగా మూడు అర్థసెంచరీలు సాధించడం వెనుక నా సీక్రెట్ అదే.  నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా.’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఫిక్సింగ్ క‌ల‌క‌లం.. ఏడుగురు ఆట‌గాళ్ల‌పై నిషేధం!

Advertisement
 
Advertisement
Advertisement