పంజాబ్‌పై రాజస్థాన్‌ గెలుపు | IPL 2026 Match 40: Punjab Kings vs Rajasthan Royals Updates | Sakshi
Sakshi News home page

పంజాబ్‌పై రాజస్థాన్‌ గెలుపు

Apr 28 2026 7:03 PM | Updated on Apr 28 2026 11:01 PM

IPL 2026 Match 40: Punjab Kings vs Rajasthan Royals Updates

పంజాబ్‌పై రాజస్థాన్‌ గెలుపు
అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. డొనోవన్‌ ఫెరియెరా (52 నాటౌట్‌), షుభమ్‌ దూబే (31 నాటౌట్‌) ఊచకోత కోసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
13.6వ ఓవర్‌- 151 పరుగుల వద్ద రాజస్థాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో షెడ్గేకు క్యాచ్‌ ఇచ్చి రియాన్‌ పరాగ్‌ (29) ఔటయ్యాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
11.2వ ఓవర్‌- 123 పరుగుల వద్ద రాజస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో షెడ్గేకు క్యాచ్‌ ఇచ్చి జైస్వాల్‌ (51) ఔటయ్యాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
9.4వ ఓవర్‌- 105 పరుగుల వద్ద రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి జురెల్‌ (16) ఔటయ్యాడు.  

వైభవ్‌ సూర్యవంశీ ఔట్‌
3.2వ ఓవర్‌- 51 పరుగుల వద్ద రాజస్థాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అ‍య్యర్‌ క్యాచ్‌ పట్టడంతో వైభవ్‌ సూర్యవంశీ (43) ఔటయ్యాడు.

పంజాబ్‌ భారీ స్కోర్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ భారీ స్కోర్‌ (222-4) చేసింది. ఆఖర్లో స్టోయినిస్‌ (22 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్‌ శర్మ వేసిన చివరి ఓవర్‌లో స్టోయినిస్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు. 

అంతకుముందు ప్రభ్‌సిమ్రన్‌ (59) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా పంజాబ్‌ ఆటగాళ్లలో  ప్రియాంశ్‌ ఆర్య (29), కూపర్‌ కన్నోల్లీ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో యశ్‌ రాజ్‌ పుంజా 2, ఆర్చర్‌, బర్గర్‌ తలో వికెట్‌ తీశారు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
17.6వ ఓవర్‌- 181 పరుగుల వద్ద పంజాబ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. బర్గర్‌ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఔటయ్యాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
13.6వ ఓవర్‌- 144 పరుగుల వద్ద పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రాజ్‌ పుంజా బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్‌ (59) ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
8.2వ ఓవర్‌- 96 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. యశ్‌ పుంజా బౌలింగ్‌లో ఫెరియెరాకు క్యాచ్‌ ఇచ్చి కూపర్‌ కన్నోల్లీ (30) ఔటయ్యాడు. 

7 ఓవర్ల తర్వాత 80-1
7 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 80-1గా ఉంది. ప్రభ్‌సిమ్రన్‌ 27, కూపర్‌ కన్నోల్లీ 19 పరుగులతో అజేయంగా ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
2.5వ ఓవర్‌- క్రీజ్‌లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన ప్రియాంశ్‌ ఆర్మ (29) ఆర్చర్‌ బౌలింగ్‌లో బర్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌
ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 28) జరుగనున్న 40వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. పంజాబ్‌ హోం గ్రౌండ్‌ అయిన ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

ప్రస్తుత ఎడిషన్‌లో ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్‌ (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్‌ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. 

ఈ మ్యాచ్‌ కోసం​ రాజస్థాన్‌ రెండు మార్పులు చేసింది. హెట్‌మైర్‌ స్థానంలో షనక, రవి బిష్ణోయ్‌ స్థానంలో యశ్‌ రాజ్‌ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్‌ కూడా ఈ మ్యాచ్‌ కోసం రెండు మార్పులు చేసింది. సూర్యంశ్‌ షెడ్గే, లోకీ ఫెర్గూసన్‌ తుది జట్టులోకి వచ్చారు.

తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), కూపర్ కొన్నోలీ, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
 

Advertisement
 
Advertisement
Advertisement