'క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం మా కొంప‌ముంచింది’ | Rajasthan Royals Captain Riyan Parag Comments After Match Lost Vs KKR | Sakshi
Sakshi News home page

'క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం మా కొంప‌ముంచింది’

Apr 19 2026 7:51 PM | Updated on Apr 19 2026 8:10 PM

Rajasthan Royals Captain Riyan Parag Comments After Match Lost Vs KKR

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఆదివారం కేకేఆర్ చేతిలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 4 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూసింది. మ్యాచ్‌ ఓటమిపై పరాగ్‌ స్పందించాడు. క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం త‌మ కొంప ముంచింద‌ని రాజ‌స్తాన్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ తెలిపాడు. 

మ్యాచ్ ముగిసిన అనంత‌రం ప‌రాగ్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో తొలి నాలుగు ఓవ‌ర్లు ముగిసేసరికి ఈ పిచ్‌పై 170 ప‌రుగులు చేస్తే విజ‌యం సాధించొచ్చు అని భావించాం. కానీ 10 ప‌రుగులు వెనుక‌బ‌డ్డాం. మా బౌల‌ర్లు క‌ష్ట‌ప‌డ్డారు. కానీ ఫీల్డింగ్‌లో కొన్ని త‌ప్పులు చేశాం. క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం మా కొంపముంచింది. అయితే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉంది. 

కానీ మా జ‌ట్టులో ఇవాళ పేస‌ర్లు ఎక్కువ‌గా ఉండడం, బిష్ణోయ్ మాత్ర‌మే రెగ్యుల‌ర్ స్పిన్న‌ర్‌గా ఉండ‌డం మాకు ప్ర‌తికూలంగా మారింది. బ్రిజేశ్ శ‌ర్మ ఇవాళ చాలా బాగా బౌలింగ్ వేశాడు. 14, 16వ ఓవ‌ర్లో అత‌ను సూప‌ర్‌గా బౌలింగ్ చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్ పూర్తైన త‌ర్వాత క్రీజులో ఇద్ద‌రు ఎడమ‌చేతి బ్యాట‌ర్లు ఉండ‌డం, ఆ స‌మ‌యంలో మా వ‌ద్ద స్పిన్ బౌల‌ర్ లేక‌పోవ‌డం కూడా ఓట‌మికి దారి వేసింద‌ని చెప్పొచ్చు. 

ఇవాళ బ్యాటింగ్‌లో కూడా ఆశించినంత స్థాయిలో రాణించ‌లేక‌పోయాం. రెండు ఓట‌ములు వ‌చ్చినంత మాత్రాన వెన‌క్కి తగ్గిన‌ట్లు కాదు. మ‌ళ్లీ ఫుంజుకుంటాం. ఇక ’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement