రవి బిష్ణోయ్‌ అరుదైన రికార్డు! | Ravi Bishnoi Becomes Youngest Indian To Take 200 Wickets In T20s | Sakshi
Sakshi News home page

IPL 2026: రవి బిష్ణోయ్‌ అరుదైన రికార్డు!

Apr 5 2026 8:08 AM | Updated on Apr 5 2026 11:14 AM

Ravi Bishnoi Becomes Youngest Indian To Take 200 Wickets In T20s

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. శ‌నివారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్ ఆఖ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగింది. అయితే మొద‌ట బ్యాటింగ్‌లో ధ్రువ్ జురేల్‌, జైస్వాల్ మెరిస్తే.. ఆ త‌ర్వాత బౌలింగ్‌లో ర‌వి బిష్ణోయ్‌, తుషార్ దేశ్‌పాండే సూప‌ర్ బౌలింగ్‌తో రాజ‌స్తాన్ థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. 

మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన బిష్ణోయ్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. గుజ‌రాత్ బ్యాట‌ర్లు సాయి సుద‌ర్శ‌న్‌, గ్లెన్ పిలిప్స్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రాహుల్ తెవాటియాలు ర‌వి బిష్ణోయ్‌ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే గ్లెన్ పిలిప్స్ వికెట్ తీయ‌డం ద్వారా ర‌వి బిష్ణోయ్‌ టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 

అయితే భార‌త్ త‌ర‌ఫున‌ ఈ ఘ‌న‌త సాధించిన అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా (25 ఏళ్ల 211 రోజులు) బిష్ణోయ్‌ నిలిచాడు. 171 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు భార‌త్ త‌ర‌ఫున టీ20ల్లో 200 వికెట్లు తీసిన 19వ బౌల‌ర్‌గా, 9వ స్పిన్ బౌల‌ర్‌గా ర‌వి బిష్ణోయ్‌ రికార్డులకెక్కాడు. ఓవ‌రాల్‌గా చూసుకుంటే టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా ర‌షీద్ ఖాన్ (23 ఏళ్ల 119 రోజులు) పేరిట రికార్డు ఇప్ప‌టికీ ప‌దిలంగా ఉంది. 

ఇక ఐపీఎల్‌లో ప్ర‌స్తుతం రాజ‌స్తాన్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన ర‌వి బిష్ణోయ్‌ గ‌త‌లో పంజాబ్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు. టీమిండియా త‌ర‌ఫున 44 టీ20లు ఆడిన ర‌వి బిష్ణోయ్‌ 64 వికెట్లు ప‌డ‌గొట్టాడు.మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. జురేల్ (75), జైస్వాల్ (55) రాణించారు. అనంత‌రం క‌డ‌దాకా పోరాడిన గుజ‌రాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మై 6 ప‌రుగుల తేడాతో పరాజ‌యం చ‌విచూసింది. 

చదవండి: ‘ఆ తప్పిదం మా కొంపముంచింది’

Advertisement
 
Advertisement
Advertisement