ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయంతో రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్లుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు ప్లేఆఫ్స్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ సమయంకు సంబంధించి పూర్తి వివరాలు విడుదల చేశారు. మే 26న జరగనున్న క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది.
ఇక మే 27న ఎలిమినేటర్ పోరులో ఎస్‌ఆర్‌హెచ్, రాజస్తాన్ తలపడనున్నాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మే 29న జరగనున్న క్వాలిఫయర్-2 పోరులో ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు తలపడనుంది.
ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముల్లన్‌పూర్ వేదిక కానుంది. ఇక ఆదివారం (మే 31న) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో క్వాలిఫయర్-1 విజేతతో క్వాలిఫయర్-2 విజేత అమీతుమీ తేల్చుకోనుంది.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్
మే 26- క్వాలిఫయర్-1 (ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, ధర్మశాల, రాత్రి 7.30 నుంచి)
మే 27- ఎలిమినేటర్ (ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్తాన్, ముల్లన్‌పూర్, రాత్రి 7.30 నుంచి)
మే 29-క్వాలిఫయర్-2 (క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత, ముల్లన్‌పూర్, రాత్రి 7.30 నుంచి)
మే 31- ఫైనల్ (క్వాలిఫయర్-1 విజేత వర్సెస్ క్వాలిఫయర్-2 విన్నర్, అహ్మదాబాద్, రాత్రి 7.30 నుంచి)
4️⃣ teams. 1️⃣ winner
All roads lead to the ultimate glory 🏆#TATAIPL | #TheFinalLeap pic.twitter.com/waI2u61Q4t— IndianPremierLeague (@IPL) May 24, 2026


