IPL 2024- RCB Vs LSG: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే వేదికపై వంద టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది.
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లక్నో క్వింటన్ డికాక్(56 బంతుల్లో 81), నికోలస్ పూరన్(21 బంతుల్లో 40- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆరంభంలో కాస్త పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి(16 బంతుల్లో 22), ఫాఫ్ డుప్లెసిస్(19), రజత్ పాటిదార్(29) కాసేపు క్రీజులో నిలబడ్డారు. కానీ లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ ధాటికి గ్లెన్ మాక్స్‌వెల్ డకౌట్ కాగా.. కామెరాన్ గ్రీన్ 9 పరుగులకే నిష్క్రమించాడు.
📸: 𝙃𝙤𝙡𝙙 𝙩𝙝𝙖𝙩 𝙥𝙤𝙨𝙚 👑 #RCBvLSG #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/UW5tZft1lQ
— JioCinema (@JioCinema) April 2, 2024
వికెట్ కీపర్ అనూజ్ రావత్(11) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. మహిపాల్ లామ్రోర్ (13 బంతుల్లో 33) కాసేపు మెరుపులు మెరిపించినా ఆర్సీబీ లక్ష్యానికి చేరువకాలేకపోయింది. ఫలితంగా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏
— IndianPremierLeague (@IPL) April 2, 2024
They move to number 4⃣ on the Points Table!
Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim
ఇక మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి మాత్రం అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే వేదికపై వంద టీ20లు ఆడిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచాడు. చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో ఆడిన మ్యాచ్ ద్వారా కోహ్లి ఇక్కడ అలా సెంచరీ కొట్టాడన్న మాట!
ఒకే వేదికపై అత్యధిక టీ20లు ఆడిన భారత క్రికెటర్లు
1. విరాట్ కోహ్లి- ఎం.చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు- 100
2. రోహిత్ శర్మ- వాంఖడే స్టేడియం- ముంబై- 80
3. మహేంద్ర సింగ్ ధోని- ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్)- చెన్నై.
చదవండి: WC 2019: పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచింది!
Comments
Please login to add a commentAdd a comment