పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి మైదానంలోకి పరిగెత్తుకు వచ్చాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రీజులో ఉన్న సమయంలో దూసుకువచ్చి.. అతడి పాదాలకు నమస్కరించాడు. అనంతరం కోహ్లిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు.
ఇంతలో అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ- పంజాబ్ మధ్య బెంగళూరులో సోమవారం నాటి మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. కోహ్లిని హత్తుకున్న సదరు అజ్ఞాత వ్యక్తిని బయటకు తీసుకువెళ్లి దారుణంగా కొట్టారంటూ మరో వీడియో తెర మీదకు వచ్చింది. ప్రణీత్ అనే ఎక్స్ యూజర్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘‘ఆర్సీబీ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు. ఎవరి మీదా చెయ్యి చేసుకునే హక్కు మీకు లేదు. అలా చేయడం చట్టానికి విరుద్ధం. నిబంధనలు అతిక్రమించినందుకు అతడిని జైళ్లో పెట్టవచ్చు. లేదంటే జరిమానా విధించొచ్చు.
అంతేగానీ స్టేడియంలోనే అతడిని కొడతారా? ఒక్కసారి విరాట్ కోహ్లి గనుక ఆర్సీబీని వీడితే మిమ్మల్ని ఒక్కడు కూడా పట్టించుకోడు’’ అంటూ ఘాటుగా విమర్శించాడు. అయితే, ఈ వీడియోలో ఉన్నది.. కోహ్లిని హత్తుకున్న వ్యక్తేనా? కాదా? అన్న అంశంపై మాత్రం క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో 77 పరుగులు చేసిన కోహ్లి.. ఆర్సీబీని గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. బెంగళూరు వేదికగా శుక్రవారం ఈ మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment