విరాట్ కోహ్లి (PC: IPL/BCCI)
టీ20 ప్రపంచకప్-2024 రేసులో తాను ముందే ఉన్నానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పొట్టి ఫార్మాట్‌ను ప్రమోట్ చేసేందుకు తన పేరును వాడుకుంటున్నారంటూ విమర్శకులకు చురకలు అంటించాడు. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఏడాది ప్రపంచకప్ ఆడబోతున్న భారత జట్టులో కోహ్లికి స్థానం దక్కకపోవచ్చంటూ ఇటీవల వార్తలు వైరలైన విషయం తెలిసిందే.
యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్... కోహ్లిని పక్కనపెట్టాలనే యోచనలో ఉన్నాడంటూ వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ స్పందిస్తూ.. తన జట్టులో కోహ్లి కచ్చితంగా ఉండాలంటూ రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశాడంటూ తానూ ఓ ట్వీట్‌తో ఈ చర్చలో భాగమయ్యాడు.
ఇదిలా ఉంటే.. దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఐపీఎల్-2024తో రీఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆటకు దూరమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆర్సీబీ తరఫున ఆరంభ మ్యాచ్‌లో కేవలం 21 పరుగులకే పరిమితమయ్యాడు.
అయితే, సోమవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. జానీ బెయిర్ స్టో క్యాచ్ వదిలేయడంతో సున్నా పరుగుల వద్ద లైఫ్ పొందిన కోహ్లి.. 77 పరుగుల(11 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించాడు. తద్వారా ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
అంతేకాదు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 98 పరుగులతో ఆరెంజ్‌క్యాప్‌ను కూడా కైవసం(ప్రస్తుతానికి) చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ఫార్మాట్లో నేను ఓపెనింగ్ చేస్తున్నాను.
ఎల్లప్పుడూ మా జట్టుకు శుభారంభం ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అయితే, వికెట్లు పడేకొద్దీ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు షాట్లు ఆడేందుకు సంశయించాల్సి వస్తుంది.
ఏదేమైనా ఎప్పుటికప్పుడు ఆటను మెరుగుపరచుకుంటూ ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం. ఇప్పటికీ టీ20 ఫార్మాట్‌ను ప్రమోట్ చేసేందుకు నా పేరును తరచుగా వాడటం చూస్తూనే ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతానికి తన వద్ద ఉందని.. ఇప్పుడే సంబరాలు చేసుకోవడం సరికాదంటూ అభిమానులపై సరదాగా చిరుకోపం ప్రదర్శించాడు.
గణాంకాలు కేవలం నంబర్లే అయినా మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని రాహల్ ద్రవిడ్ ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాడని కోహ్లి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. పనిలో పనిగా తాను టీ20 వరల్డ్‌కప్ జట్టు రేసులో లేనన్న వారికి సమాధానం కూడా ఇచ్చాడు.
🗣️🗣️ You're not going to think of numbers and stats, it's the memories that you create
— IndianPremierLeague (@IPL) March 25, 2024
Orange cap holder Virat Kohli with a special message and a special mention to #TeamIndia Head Coach Rahul Dravid 🤗#TATAIPL | #RCBvPBKS | @imVkohli pic.twitter.com/uW0Vb7Y8m9
Comments
Please login to add a commentAdd a comment