
ఐపీఎల్-2024ను పేలవంగా ఆరంభించిన వెంకటేశ్ అయ్యర్.. తాజా మ్యాచ్‌లో మాత్రం దంచికొట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ దుమ్ములేపాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ అభిమానులను అలరించాడు.
ఎదుర్కొన్న 30 బంతుల్లోనే 50 పరుగులతో సత్తా చాటాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో గాయంపై అప్‌డేట్ అందించిన అయ్యర్.. ‘‘కండరాలు పట్టేసినట్లు అనిపించింది.
ఎందుకైనా మంచిదని స్కానింగ్‌కు వెళ్లాను. ఈ రోజు మ్యాచ్ అద్భుతంగా సాగింది. మరో ఎండ్‌లో సునిల్ నరైన్ నుంచి గొప్ప సహకారం లభించింది. ఈరోజు క్రెడిట్ మొత్తం నరైన్‌కు ఇవ్వాల్సిందే.
మాపై ఏమాత్రం ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు. విజయానికి అతడు పునాదులు వేస్తే.. మేము పని పూర్తిచేశాం’’ అని పేర్కొన్నాడు. వెన్నునొప్పి గురించి పెద్దగా ఆందోళన అక్కర్లేదని తెలిపాడు. ఇక హాఫ్ సెంచరీ నేపథ్యంలో తన ‘కిస్’ సెలబ్రేషన్ గురించి చెబుతూ.. ‘‘నాకు కాబోయే భార్య కూడా ఈరోజు మ్యాచ్‌కు వచ్చింది.
నా ఇన్నింగ్స్‌లో ఆమెకూ క్రెడిట్ ఇవ్వాలని భావించాను’’ అని వెంకటేశ్ అయ్యర్ నవ్వులు చిందించాడు. కాగా గతేడాది నవంబరులో వెంకటేశ్ అయ్యర్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
ఫ్యాషన్ డిజైనర్ అయిన శృతి రఘునాథన్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శుక్రవారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ (22 బంతుల్లో 47 పరుగులు) అద్భుతంగా రాణించాడు.
చదవండి: IPL 2024: రూ.11 కోట్లు తీసుకున్నాడు.. కట్ చేస్తే! ఆర్సీబీని నిండా ముంచేశాడు
A well deserved 50 for Venkatesh Iyer in just 29 deliveries 💪🫡‼️#KKRvRCB
— Kolkata Knight Riders Universe (@KKRUniverse) March 29, 2024
pic.twitter.com/IDDmCiFjNu