వెంక‌టేశ్ అయ్య‌ర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే? | Kolkata Knight Riders bowled out for 169 runs | Sakshi

వెంక‌టేశ్ అయ్య‌ర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?

May 3 2024 9:36 PM | Updated on May 4 2024 8:56 AM

Kolkata Knight Riders bowled out for 169 runs

ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ నామ‌మాత్ర‌పు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

52 బంతుల్లో 70 ప‌రుగులు చేసిన అయ్య‌ర్‌.. కేకేఆర్ ఫైటింగ్ స్కోర్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 60 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన కేకేఆర్‌ను అయ్య‌ర్ త‌న ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయ్య‌ర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన మ‌నీష్ పాండే కూడా త‌న వంతు పాత్ర పోషించాడు.

31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 42 ప‌రుగులు చేశాడు. ఇక ముంబై బౌల‌ర్ల‌లో తుషారా, బుమ్రా త‌లా 3 వికెట్లతో చెల‌రేగ‌గా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement