ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న వైవిధ్యం ఏ ఫ్రాంచైజీకి ఉండదు. విషయం ఏదైనా సరే ఈ ఫ్రాంచైజీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 16 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినా ఈ జట్టుపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఏ యేటికి ఆ యేడు ఆర్సీబీ క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగదు. ఈ జట్టు అభిమానులు తమ ఆటగాళ్లపై ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని కోల్పోరు. ప్రదర్శన పరంగా ఎంతటి హీన స్థితిలో ఉన్నా ఆర్సీబీ అభిమానులు "ఈ సాలా కప్ నమదే" అంటూ బీరాలు పలుకుతుంటారు.
రికార్డులు నెలకొల్పాలన్నా వీరే.. చెత్త రికార్డులు మూటగట్టుకోవాలన్నా వీరే. ట్రెండ్ సెట్ చేయాలన్నా వీరే.. అదే ట్రెండ్‌ను బ్రేక్ చేయాలన్నా వీరే. గణాంకాలు, గత రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఆర్సీబీ ఎంత వైవిధ్యమైన జట్టో మరోసారి రుజువు చేస్తుంది.
ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 11 మ్యాచ్‌ల్లో పదింట సొంత మైదానాల్లో ఆడిన జట్లే విజేతలుగా నిలిచాయి. ఒక్క ఆర్సీబీ మాత్రమే తమ సొంత మైదానంలో మ్యాచ్‌ను కోల్పోయి హోం గ్రౌండ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. శుక్రవారం (మార్చి 29) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలైంది. పది మ్యాచ్‌లుగా నడస్తున్న సెంటిమెంట్‌ను ఆర్సీబీ బ్రేక్ చేసింది. ఆర్సీబీ అన్ని జట్లలా కాదని అని నిరూపించడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో ఆదివారం (మార్చి 31) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ను ఎదుర్కోనుండగా.. రాత్రి మ్యాచ్‌లో ఢిల్లీ, సీఎస్‌కే జట్లు తలడనున్నాయి. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 2న ఆడనుంది. సొంత మైదానంలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ.. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment