ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. మెగా వేలంలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిరాజ్‌కు షాకివ్వగా.. టైటాన్స్ మాత్రం భారీ మొత్తం వెచ్చించింది. కాగా హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ సన్‌రైజర్స్ తరఫున 2017లో క్యాచ్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.
ఏడేళ్లు అక్కడే
అయితే, ఆ మరుసటి ఏడాది(2018) ఆర్సీబీ అతడిని రెండున్నర కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంది. 2022లో రూ. 7 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుని అంతే మొత్తానికి 2024 వరకు కొనసాగించింది. అయితే, 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేసింది. దీంతో అతడు ఆక్షన్‌లోకి వచ్చాడు.
చెన్నై కూడా రేసులో
ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన ఆదివారం నాటి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో అతడు రేసులోకి వచ్చాడు. గుజరాత్ అతడి కోసం ఆదినుంచే పోటీ పడగా.. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆసక్తి చూపాయి. అయితే, రూ. 8 కోట్ల వరకు గుజరాత్‌తో నువ్వా- నేనా అన్నట్లు తలపడిన చెన్నై.. ఆ తర్వాత రేసు నుంచి నిష్క్రమించింది.
మాకు వద్దు.. సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకున్న ఆర్సీబీ
ఈ దశలో రాజస్తాన్ మళ్లీ పోటీకి రాగా.. గుజరాత్ రూ. 12.25 కోట్ల మెరుగైన ధరకు సిరాజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, సిరాజ్ విషయంలో రైటు మ్యాచ్ కార్డును వినియోగించుకుంటారా అని ఆక్షనీర్ మల్లికా సాగర్ ఆర్సీబీని అడుగగా.. సదరు ఫ్రాంఛైజీ మాత్రం అంత ధర పెట్టే ఉద్దేశం తమకు లేదంటూ సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకుంది.
ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం పేసర్ 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో సిరాజ్‌కు గుజరాత్ మూడో ఫ్రాంఛైజీ. అదే విధంగా ఇదే అత్యధిక ధర.
ఇక ఐపీఎల్-2022 ద్వారాక్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే చాంపియన్‌గా నిలిచింది. గతేడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈసారి మాత్రం ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.
చదవండి: IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment