అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది.. ధోని భాయ్‌ జట్టుతో ఉన్నా సరే! | IPL 2024: Never Felt Any Pressure, Had Mahi Bhai My Side, Says CSK Ruturaj Gaikwad | Sakshi
Sakshi News home page

CSK vs RCB: అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది.. ధోని భాయ్‌ ఉన్నాడు కాబట్టే: రుతురాజ్‌

Published Sat, Mar 23 2024 9:00 AM | Last Updated on Sat, Mar 23 2024 10:02 AM

IPL 2024 Never Felt Any Pressure Had Maho Bhai My Side: CSK Ruturaj Gaikwad - Sakshi

ధోనితో రుతురాజ్‌ గైక్వాడ్‌ (PC: IPL/CSK)

Ruturaj Comments After Chennai Super Kings won by 6 wkts: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్నాడు యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌. ఐపీఎల్‌-2024 ఆరంభ మ్యాచ్‌లో పటిష్ట రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో పోరులో సీఎస్‌కేను గెలిపించి సత్తా చాటాడు. సొంత మైదానం చెపాక్‌ వేదికగా గెలుపు నమోదు చేసి మధుర జ్ఞాప​కాలు ప్రోది చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ.. కెప్టెన్సీని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని తెలిపాడు. సారథిగా వ్యవహరించడం తనపై ఎలాంటి అదనపు ఒత్తిడిని కలిగించదని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్రను ముందుండి నడిపించిన అనుభవం తనకు ఉందని తెలిపాడు.

అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది
ఇక ఈ మ్యాచ్‌లో మహీ భాయ్‌(మహేంద్ర సింగ్‌) ఉన్నాడు కాబట్టి తన పని మరింత సులువైందని రుతురాజ్‌ గైక్వాడ్‌ పేర్కొన్నాడు. అదే విధంగా.. మ్యాచ్‌ గురించి చెబుతూ.. ‘‘ఆరంభ ఓవర్ల నుంచే మ్యాచ్‌ మా నియంత్రణలోకి వచ్చేసింది. వాళ్లను మరింత తక్కువ స్కోరుకే పరిమితం చేయగలం అనుకున్నాం.

కానీ అలా కుదరలేదు. నిజానికి మాక్స్‌వెల్‌, ఫాఫ్‌లను అవుట్‌ చేయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వరుస విరామాల్లో మూడు వికెట్లు పడగొట్టడం తో మ్యాచ్‌ మా చేతుల్లోకి వస్తుందన్న నమ్మకం కుదిరింది.

మా జట్టులోని ప్రతి ఒక్కరూ స్ట్రోక్‌ ప్లేయర్సే. జింక్స్‌(అజింక్య రహానే) కూడా సానుకూల దృక్పథంతో ఆడాడు. జట్టులోని ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటన్న అంశంపై స్పష్టత ఉంది. 

ఈ రోజు బౌలర్లు తమ పాత్రను చక్కగా నెరవేర్చారు. అందరూ బాగానే బ్యాటింగ్‌ చేశారు. అయితే, టాపార్డర్‌ బ్యాటర్లు 15 ఓవర్‌ వరకు క్రీజులో ఉండగలిగితే మిగతా వాళ్ల పని మరింత సులువవుతుంది’’ అని రుతురాజ్‌ గైక్వాడ్‌ విశ్లేషించాడు.

ఓపెనర్‌గా మాత్రం విఫలం
కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన చెన్నై తొలుత బౌలింగ్‌ చేసింది. ఆర్సీబీని 173 ఓవర్లకు కట్టడి చేసిన రుతురాజ్‌ సేన.. 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సీఎస్‌కే బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌(4/29) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక రుతురాజ్‌ ఈ మ్యాచ్‌లో కేవలం 15 పరుగులే చేసి ఓపెనర్‌గా మాత్రం విఫలమయ్యాడు.

సీఎస్‌కే వర్సెస్‌ ఆర్సీబీ స్కోర్లు:
►వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్‌), చెన్నై
►టాస్‌: ఆర్సీబీ.. బ్యాటింగ్‌
►ఆర్సీబీ స్కోరు:  173/6 (20)
►సీఎస్‌కే స్కోరు:  176/4 (18.4)
►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలుపు.

చదవండి: IPL 2024: టీమిండియాలోనే కాదు.. ఇక్కడా ఇంతేనా?! వీడియో వైర‌ల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement