ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఎవరనగానే ఠక్కున.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు చెప్పేస్తారు క్రికెట్ ప్రేమికులు. ఇక అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నది ఎవరంటే.. మరో ఇద్దరు భారత స్టార్లు శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్. మరి ఈ ముగ్గురికి సాధ్యంకాని రీతిలో ఓ అరుదైన ఫీట్ సాధించిన ఆటగాడు మరొకడు ఉన్నాడు.
క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక హైక్ పొందిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఏకంగా 5500 శాతం హైక్‌తో కోట్లు కొలగొట్టాడు. ఇంతకీ అతడు ఎవరా అంటారా?!....
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ. అవును.. ఐపీఎల్‌లో ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో జితేశ్ ఏకంగా ఈసారి వేలంలో తన పాత ధర కంటే.. 5500 శాతం ఎక్కువ మొత్తం పలికాడు.
21 నిమిషాల వ్యవధిలోనే
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండురోజుల పాటు జరిగిన వేలంలో.. మొదటిరోజే రికార్డులు బ్రేకైన విషయం తెలిసిందే. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రూ. 18 కోట్లను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కోసం రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు.
అయితే, 21 నిమిషాల వ్యవధిలోనే అతడి రికార్డును రిషభ్ పంత్ బద్దలుకొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్-2024 సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. జట్టును చాంపియన్‌గా నిలిపిన అతడు కేకేఆర్ నుంచి 2022 వేలంలో రూ. 12.25 కోట్లు అందుకున్నాడు. అంతే మొత్తానికి ఈసారీ ఆడాడు.
అర్ష్‌దీప్ హైక్ 3500 శాతానికి పైనే!
అయితే, ఈసారి వేలంలో రూ. 26.75 కోట్లు దక్కించుకోవడంతో అయ్యర్‌కు 200 శాతం మేర హైక్ లభించినట్లయింది. మరోవైపు అర్ష్‌దీప్ గతంలో రూ. 4 కోట్లే అందుకున్నాడు. ఈసారి ఏకంగా రూ. 18 కోట్లు దక్కించుకున్నాడు. అంటే అర్ష్‌దీప్ హైక్ 3500 శాతానికి పైనే!
ఇక రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా గతంలో రూ. 16 కోట్లు అందుకోగా.. ఈసారి 11 కోట్ల మేర హైక్ పొందాడు. మరోవైపు.. లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కూడా భారీ జంప్ కొట్టాడు. చివరగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చహల్ పాత ధర రూ. 6జ5 కోట్లు.. ఈసారి పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.
20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్
మరి జితేశ్ శర్మ ధర సంగతి ఏమిటంటారా?!.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఈ విదర్భ ఆటగాడిని రూ. 20 లక్షల కనీస ధరకు కొనుక్కుంది. 2024 వరకు అదే ధరకు అతడిని కొనసాగించింది. అయితే, ఈసారి వేలంలో జితేశ్‌కు డిమాండ్ రాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ. 11 కోట్లకు సొంతం చేసుకుంది. అలా 20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్ కొట్టాడు.
నిజానికి 2024 ఎడిషన్‌లో జితేశ్ పెద్దగా రాణించలేదు. 131 స్ట్రైక్‌రేటుతో కేవలం 187 పరుగులే చేశాడు. అయినప్పటికీ భారీ ధర పలకడానికి కారణం అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు. అంతేకాదు పొట్టిఫార్మాట్లో లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గానూ జితేశ్‌కు మంచి రికార్డు ఉంది. ఇక దినేశ్ కార్తిక్ రిటైర్మెంట్ తర్వాత ఆర్సీబీకి వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం కూడా ఉండటంతో జితేశ్ పంట ఇలా పండింది.
చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?
Comments
Please login to add a commentAdd a comment